ఇండియా కోసం ఇజ్రాయెల్ లో ‘ నమ శివాయ’ అంటూ ప్రార్థన!

0
175

భారత దేశంలో కరోనా రెండో దశ ఏ విధంగా వ్యాప్తి చెందిందో మనకు తెలిసిందే. రోజురోజుకు కేసులో పెరుగుతుండడంతో ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌకర్యం లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ విపత్కర పరిస్థితులలో నుంచి మన దేశాన్ని ఆదుకోవడం కోసం ఎంతోమంది తమ వంతు సాయంగా విరాళాలను ప్రకటిస్తూ ఆక్సిజన్ సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతదేశం ఈ సంక్షోభం నుంచి బయటకు రావాలని కొన్ని దేశాల ప్రజలు దేవుని ప్రార్థిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ దేశంలో భారత దేశం కోసం ‘ఓం నమః శివాయః’ అంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు.ప్రస్తుతం ఇండియాలో ఏర్పడిన ఈ విపత్కర పరిస్థితి నుంచి భారత ప్రజలను కాపాడాలని ఆ దేశంలోని ప్రజలు ప్రధాన కూడళ్ల వద్ద శివలింగాలను ఏర్పాటు చేసే పెద్ద ఎత్తున భారత దేశం కోసం ఓం నమ శివాయ అంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ అధికారి పవన్ కె పాల్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇటీవల ఈ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోలో ఇజ్రాయిల్ ప్రజలు ఓం నమ శివాయ అంటూ శివుని ప్రార్థించడం మనం చూడవచ్చు.ఈ మహమ్మారి నుంచి భారత ప్రజలను కాపాడాలని వీరు చేస్తున్న ప్రార్థనలకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/p/COdefuNDmXq/?utm_source=ig_web_copy_link

ఈ వీడియో చూసిన భారతీయ నెటిజన్లు తమ దేశం కోసం ప్రార్థిస్తున్న ఇజ్రాయిల్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీరు చేస్తున్న ఈ ప్రార్థనలు భారతదేశాన్ని ఈ సంక్షోభం నుంచి బయటపడేస్తాయని, ఈ ప్రార్థనలు మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయని, తొందరలోనే భారతదేశం ఈ మహమ్మారి నుంచి విముక్తి పొందుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.