మునగ చెట్టు వలన ఏన్ని ఉపయోగాలో తెలుసుకోండి.. !!

ఈ కాలంలో చాలామంది ఎక్కువగా ఎటువంటి చిన్న అనారోగ్యం అయినాగాని వెంటనే మందులు వేసేసుకుంటున్నారు. కానీ ఇలా ప్రతి చిన్న రోగానికి మందులు వేసుకుంటే భవిష్యత్తులో లేని పోనీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మరి మందులు వేసుకోకపోతే రోగం ఎలా నయమవుతుంది అన్నా ప్రశ్న చాలామందికి వచ్చే ఉంటుంది..అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎలాంటి అనారోగ్యానికైనా మన చుట్టు పక్కల ఉండే మొక్కలు,పువ్వులు, ఆకులు, వృక్షాల్లో ఏదో ఒకటి మనకు ఉపయోగపడుతుంది అని. అవునండి మీరు విన్నది నిజమే.. !! మన ఇంట్లో పెరటిలో పెంచే కొన్ని మొక్కల వలన మనకు కొన్ని అనారోగ్యాలు నయం అవుతాయి. అలాంటి కోవలోకి చెందిన చెట్లలో ఒకటే మునగ చెట్టు ఒకటి.

మన పూర్వకాలంలో మన పెద్దలు మనలా ప్రతిదానికి ఆసుపత్రికి వెళ్లి మందులు మింగారు. వాళ్ళు ముందుగా ప్రకృతి చికిత్సకు ప్రాధాన్యత ఇస్తారు. ములగ ఆకుల్లో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు మనకు కలిగే స్వల్ప అనారోగ్యాలను మాత్రమే కాదు, పలు రకాల దీర్ఘ కాలిక వ్యాధులను కూడా నయం చేయగలుగుతాయి. అసలు మునగాకు వల్ల మనకు ఎలాంటి ఉపయోగంలో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మూలగ ఆకుని అన్ని పోషకాలు ఉన్న పోషకాల గని అనడంలో తప్పులేదు. ఎందుకంటే మునగ చెట్టు ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఇది ఎటువంటి అనారోగ్యాలు రాకుండా, వ్యాధినిరోధకతను పెంచుతుంది.

దీంతోపాటు విటమిన్ బి6, విటమిన్ ఎ, ప్రోటీన్లు, విటమిన్ బి2, ఐరన్‌, మెగ్నిషియం వంటి ముఖ్యమైన పోషక పదార్థాలు మునగ ఆకుల్లో పుష్కలంగా ఉన్నాయి. అందుకనే నిత్యం మునగ ఆకును మన ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే మునగ చెట్టు ఆకులను నిత్యం కూర, లేదా రసం రూపంలో ఏదో ఒక విధంగా తీసుకున్నట్టయితే దాంతో కండరాలు బలంగా మారతాయి. ఈ ఆకులను తినడం వలన శరీరానికి కాల్షియం, ఐరన్ పుష్కలంగా అందుతాయి. దీంతో ఎముకలకు బలం చేకూరుతుంది.
మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలు కూడా దూరమవుతాయి.విటమిన్ సి, బీటా కెరోటిన్‌లు కూడా ఉండడం వల్ల క్యాన్సర్ కారక పదార్థాలు నాశనమవుతాయి. కొంతమంది అప్పుడప్పుడు తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. కావున అలాంటి వాళ్లు మునగ చెట్టు వేళ్లను తీసుకుని బాగా కడిగి వాటిని జ్యూస్‌లా చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని నిత్యం బెల్లంతోపాటు తీసుకుంటుంటే తలనొప్పి ఇట్టే మాయమవుతుంది.ఈ కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎదురుకునే ప్రధాన సమస్య షుగర్ వ్యాధి. మునగాకులు షుగర్ వ్యాధి నుండి రక్షణ కలిపిస్తాయి. ఎలాగంటే మునగ చెట్టు ఆకులను ఎండ బెట్టి పొడి చేసుకోవాలి. దీన్ని నిత్యం 7 గ్రాముల మోతాదులో ఉదయాన్నే పరగడుపున తాగాలి. దీంతో మధుమేహం ఉన్న వారి రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి.. చూసారు కదా మూలగాకు ఉపయోగాలు ఇంక ఆలస్యం చేయకుండా ములగ చెట్టు ఎక్కడ ఉందో వెతకండి మారి.. !!