మొదటి సినిమాలు సూపర్ హిట్టు.. కానీ హీరోయిన్స్ మాత్రం ఫట్టు..!!

సినిమా రంగం లో హీరోయిన్స్ పరిస్థితి ఒక్కో సమయంలో ఒక్కో రకంగా ఉంటుంది. వారి బెస్ట్ కెరియర్ కు ఇదే కొలమానం అంటూ ఏదీ ఉండదు. కొన్ని సందర్భాల్లో మంచి నటన అనే విషయం మీద పడితే మరొక సమయంలో గ్లామర్ ఉపయోగపడుతూ ఉంటుంది.

సాధారణంగా సినీ పరిశ్రమలో మంచి హిట్ పడితే ఆ హీరోయిన్ దాదాపు ఐదారు సినిమాలలో బుక్ అవుతుంటుంది. కానీ ఒక బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన తర్వాత హీరోయిన్స్ గందరగోళంలో పడ్డ పరిస్థితులు ఉన్నాయి.

ఉదా.. 1989లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి సినిమాలో నాగార్జున, గిరిజ కలిసి నటించారు. ఆ సినిమా ఘనవిజయాన్ని సాధించిన ఆ తర్వాత గిరిజ పూర్తిగా తెరమరుగయ్యారు.

1992లో బి.గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు, శిల్పా శిరోద్కర్ హీరోహీరోయిన్లుగా కలిసి నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయిన శిల్పా శిరోద్కర్ కు ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు ఏమీ రాలేదు.

1998లో కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి కలిసి నటించిన తొలిప్రేమ సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ ఆ తర్వాత కీర్తి రెడ్డి సినిమా అవకాశాలు పొందలేకపోయింది.

2000 సంవత్సరంలో విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వే కావాలి చిత్రంలో తరుణ్, రిచాపల్లోడు హీరో హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్ వద్ద తక్కువ ఖర్చుతో ఎక్కువ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. కానీ రిచా భవిష్యత్తు అయోమయంలో పడిపోయింది.

2002లో తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను చిత్రంలో ఉదయ్ కిరణ్, అనిత కలిసి నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత అనిత కి అవకాశాలు రాలేదు.

ఇదే సంవత్సరంలో విజయభాస్కర్ దర్శకత్వంలో నాగార్జున, అన్షు మన్మథుడు చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించగా అన్షు కెరియర్ డిజాస్టర్ అయ్యింది.

తర్వాత ఇదే సంవత్సరంలో‌ వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమా లో ఎన్టీఆర్, కీర్తి చావ్లా కలిసి నటించారు. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించగా కీర్తి చావ్లా భవిష్యత్తు గందరగోళంలో పడింది.

2004 సంవత్సరం లో సుకుమార్ దర్శకత్వంలో ఆర్య సినిమాలో అల్లు అర్జున్, అను మెహతా కలిసి నటించారు. లవ్ సబ్జెక్ట్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ ఆ తర్వాత అను మెహతా భవిష్యత్తు బోల్తా పడింది.

ఇదే సంవత్సరంలో బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమిస్తే చిత్రంలో సంధ్య, భరత్ కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇందులో హీరోయిన్ గా నటించిన సంధ్యకు మాత్రం తెలుగు లో ఎలాంటి అవకాశాలు రాలేదు.

2005లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు మూవీలో విక్రమ్, సదా కలిసి నటించారు. ఈ సినిమా ఏకంగా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత సదా కి ఏ ఒక్క అవకాశం రాలేదు. ఇలా అనేక సినిమాలు విజయవంతమైన ఆ తర్వాత హీరోయిన్స్ కెరీర్ గందరగోళంలో పడిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి.