సైదాబాద్ నిందుతుడు రాజు మృతిపై హైకోర్టులో పిల్..

సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు రాజు కోసం గత వారం రోజులుగా పోలీసులు గాలించగా.. రైలు పట్టాలపై అతడి శవం కనిపించిన విషయం తెలిసిందే. అతడి చెయ్యిపై మౌనిక అనే పచ్చబొట్టు ఉండటంతో అతడే రాజు అంటూ పోలీసులు నిర్ధారించారు. అయితే రాజును పోలీసులే హత్య చేశారని రాజు కుటుంసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపద్యంలో నిందితుడు రాజు మృతిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ లంచ్ మోషన్ పిటిషన్ వేసారు. అందులో రాజుది ఆత్మహత్య కాదని ఇది ఖచ్చితంగా కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ చేపడతామని చెప్పింది.