Categories: Featured

భాష రాకపోయినా, అర్థం కాకపోయినా, సినిమాలు ఫ్లాపవుతున్నా బాలీవుడ్ హీరోయిన్సే కావాలి.

తెలుగు సినిమాలలో పర భాషా నటీమణులు హీరోయిన్స్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇప్పటి వ్యవహారం కాదు. ఎన్నో ఏళ్ళుగా వస్తూనే ఉంది. తమిళం, మలయాళం, కన్నడ భాషలలో హీరోయిన్స్‌గా పాపులర్ అయిన వాళ్ళు, లేదా కొత్తగా సిని ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న వాళ్ళకి మన టాలీవుడ్ మేకర్స్ బాగానే అవకాశాలిస్తున్నారు. ఒకటి రెండు సినిమాలు ఫ్లాపయినా అమ్మాయి నేచర్ మంచిదైతే మరో రెండు సినిమాలు ఇచ్చైనా సరే స్టార్ హీరోయిన్ అయ్యేవరకు సపోర్ట్ చేస్తుంటారు. అయితే వీరు కాస్తో కూస్తో తెలుగు భాష నేర్చుకోవడానికి, భాష మీద పట్టు సాధించడానికి బాగా కష్టపడుతున్నారు కూడా.

నిత్యా మీనన్, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, రష్మిక మందన్న, కీర్తి సురేశ్ లాంటి వారు తెలుగు నేర్చుకేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ధారాళంగా తెలుగులో మాట్లాడేందుకు, సొంతగా డబ్బింగ్ చెప్పుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ యాసలో గానీ, ఇతర యాసలో గానీ సినిమాలోని పాత్ర మాట్లాడాల్సి ఉంటే ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ను నియమించుకొని మరీ భాష మీద, యాస మీద పట్టు తెచ్చుకుంటున్నారు. షూటింగ్ స్పాట్‌లో కూడా అసిస్టెంట్స్‌తో తెలుగులోనే మాట్లాడుతూ నేర్చుకుంటున్నారు. ఇటీవల పుష్ప సినిమా కోసం రష్మిక మందన్న సొంతగా డైలాగులు చెప్పేందుకు కొన్నాళ్లు ఓ ట్యూటర్‌ను పెట్టుకున్నారు.

దాదాపు సౌత్ హీరోయిన్స్ తెలుగు సినిమాలకి వారే సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. కానీ బాలీవుడ్ నుంచి వస్తున్న హీరోయిన్స్ మాత్రం దీనిని అంతగా పట్టించుకోవడం లేదు. ఏదో వచ్చామా, షూటింగ్ చేశామా ..రెమ్యునరేషన్ తీసుకున్నామా వెళ్ళిపోయామా అనేట్టుగా ఉంటున్నారు. అందుకే బాలీవుడ్ హీరోయిన్స్ నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. ప్రభాస్ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఏక్ నిరంజన్ సినిమాతో బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా ఉండదు.

ఇక ప్రభాస్ – యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియన్ సినిమా సాహోలో నటించిన శ్రద్ద కపూర్ పరిస్థితి కూడా ఇంతే. డైలాగులు చెప్పడానికి పెదాలు కదిపినట్టు అనిపిస్తుంది తప్ప సీన్ ఏంటి.. ఇందులో డైలాగులు ఏంటీ.. ఎలాంటి మూడ్‌లో డైలాగులు చెప్పాలి అనే స్పష్ఠత లేకుండా నటించేసినట్టు కనిపిస్తుంది. సాహో సినిమాలో హీరోయిన్‌గా నటించిన శృద్దా కపూర్ మన తెలుగు ప్రేక్షకులను ఎంతమాత్రం కనెక్ట్ కాలేకపోయింది. దాంతో నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ అంటే బాలీవుడ్ హీరోయిన్స్‌ని తీసుకోవాలనే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆయన నటిస్తున్నవన్ని పాన్ ఇండియన్ సినిమాలు కాబట్టే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌ని తీసుకుంటున్నారనేది తెలిసిన విషయమే. కానీ వారికి మన భాష అర్థం కాక ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలాగో పెడుతున్నారు. అంత కరెక్ట్‌గా సన్నివేశాలలో జీవించలేకపోతున్నారు. అదే సినిమాకి పెద్ద మైనస్ అవుతోంది. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో హీరోయిన్ కృతి సనన్. ఈమెకి కొంత తెలుగు భాష మీద అవగాహన ఉంది. మహేష్ బాబుతో 1 నేనొక్కడినే, నాగ చైతన్యతో దోచేయ్ సినిమాలు చేసింది. కానీ నాగ్ అశ్విన్ – ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో మాత్రం దీపిక పదుకొణ్‌కి మాత్రం తెలుగు ఏమాత్రం రాదు. మరి ఈ సినిమాల పరిస్థితేంటో చూడాలి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago