సాధారణంగా మనం మన చేతి పై లేదా మన శరీరంపై మనకు ఎంతో ప్రియమైన వారి పేర్లను టాటూలు వేయించుకోవడం చూస్తున్నాము. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 9వ తేదీన సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల చిన్నారి చరిత్రపై రాజు అనే యువకుడు చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై చంపిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.ఈ క్రమంలోనే చనిపోయిన చిన్నారికి న్యాయం జరగాలంటే నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు, డిమాండ్లు వెల్లువెత్తాయి.
నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో నిన్న ఉదయం రాజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మృతదేహం నిందితుడు రాజుదేనని పోలీసులు తన చేతి పై ఉన్న మౌనిక అనే టాటూ ఆధారంగా గుర్తించారు. మరి ఈ మౌనిక ఎవరు? ఇలా రెండు చేతులపై మౌనిక అనే పేరును ఎందుకు రాయించుకున్నారు అనే విషయానికి వస్తే..
నిందితుడు రాజు భార్య పేరు మౌనిక. పెళ్లి తర్వాత రాజు నిత్యం తాగొచ్చి తన భార్యను చిత్రహింసలకు గురి చేస్తుండడంతో మౌనిక నిందితుడు రాజునుంచి వెళ్ళిపోయి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్‌పురంలోని పుట్టింట్లోనే నివసిస్తోంది. ఈ విధంగా వీరు పెళ్లి అయిన సమయంలో తన భార్య పేరును రాజు చేతి పై టాటూ వేయించుకున్నారు. ఇలాతన భార్య తన తో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయి రాకపోవడంతో ఆ రాజు తన మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నట్లు కొందరు వెల్లడించారు.
ఈ క్రమంలోనే తన పేరును కూడా మౌనిక గా మార్చి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయంపై తన భార్య మౌనిక మాట్లాడుతూ తన భర్త తాగుబోతు అన్న మాట నిజమే కానీ ఈ విధంగా హత్యాచారం చేసే అంత దుర్మార్గుడు కాదని, తన భర్త రెండోపెళ్లి చేసుకోలేదని,తన భర్తను పోలీసులు చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తన భార్య మౌనిక వెల్లడించారు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…