ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ చిన్న వీడియో పోస్ట్ చేసినా తెగ పాపులర్ అయిపోతుంది. అందులో ఎంతో కొంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటే మాత్రం లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. కొన్ని వీడియోలు చూస్తుంటే ఎంతో భయంకరంగా ఉండటంతో పాటు.. మరి కొన్ని వీడియోలు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. మరికొన్ని చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు.. అలా ఫన్నీ వీడియోలను కూడా నెటిజన్లతో పంచుకుంటారు. ఇదిలా ఉండగా..ఓ వీడియోను చూస్తున్నంత సేపు టెన్షన్ పడాల్సి వచ్చింది.
అతడి ప్రాణాలు పోయాయా అనే అనుమానం ఉంటుంది. అలాఉంది మరీ ఆ వీడియో. ఏంటా వీడియో అంటే.. ఓ వ్యక్తి తలపై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లినప్పటికీ.. అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరాలో చోటుచేసుకుంది. ఇది కావాలని తీసింది కాదు. ప్రమాదశాత్తు జరిగిన ఘటన. ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో బైక్ పై వెళ్తున్నాడు. ఆ బైక్ పై అతడితో పాటు భార్య, ఓ చిన్న శిశువు ఉంది. ఆ సమయంలో అక్కడ వర్షం కురుస్తోంది.
అక్కడ ఏ గుంత ఉందో.. ఎక్కడ నీళ్లు ఆగి ఉన్నాయో తెలియని పరిస్థితిలో అతడు ఉన్నాడు. అప్పటికే బైక్ ను స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు. సడన్ గా అనుకోకుండా ఆ బైక్ టైర్ ఓ గుంతలో పడిపోయింది. దీంతో బైక్ పై ఉన్న ముగ్గురు కుడివైపుకు పడిపోయారు. అదే సమయంలో ఎదురుగా ట్రాక్టర్ వస్తుంది. అప్పటికే ట్రాక్టర్ ముందు టైర్లు వెళ్లిపోయాయి.
ట్రాక్టర్ కు అటాచ్ చేసిన ట్రాలీ టైర్లకు తగిలి మహిళ, శిశువు దూరంగా విసిరేయపడ్డారు. కానీ బైక్ నడిపే వ్యక్తి మాత్రం ఆ టైర్లకింద తల పడిపోయింది. కానీ అతడికి ఏ మాత్రం దెబ్బతగలలేదు. తర్వాత ఆమె తన శిశువును తీసుకొని ట్రాక్టర్ నడిపే వ్యక్తి వద్దకు వెళ్లింది. అక్కడ నుంచి వెళ్లే వాహనదారులు అతడిని లేపారు. అతడు చనిపోయాడనుకున్న వాళ్లు అదృష్టం బాగుండి బయటపడ్డాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…