General News

తగ్గుతున్న బంగారం ధర.. నెల రోజులకు దాదాపు రూ.1600 తగ్గుదల..

బంగారం అంటే ఇష్టపడని వారు అస్సలు ఉండరు. ఎక్కువ సంపాదన, డబ్బులు ఉన్నవాళ్లు ఎక్కువగా గోల్డ్ లో ఇన్ వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే బంగారం దాదాపు నెల రోజులతో పోల్చితే రూ.1600 వరకు తగ్గింది. వివరాల్లోకి వెళ్తే.. బంగారం ప్రియులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే.. గత కొన్ని నెలల నుంచి బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఏ రోజు ఎంత పెరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

అంతేకాకుండా బంగారం తీసుకోవాలని అనుకునే వారు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది. దాదాపు తులం బంగారం అంటే 10 గ్రాములు రూ.50 వేలు దాటేసింది. అయితే గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు దిగి వస్తున్నాయి. 10 గ్రామలు బంగారం ధరలు రోజుకు రూ.100 నుంచి రూ.200 చొప్పున దగ్గుకుంటూ వస్తున్నాయి. పోయిన నెల అంటే ఆగస్టు 15 నాటికి 10 గ్రాముల ధర (22 క్యారెట్స్) రూ.45 వేలు ఉండగా.. ప్రస్తుతం ఆ ధర రూ.

43,400 లకు చేరింది. ప్రస్తుతం ఈ ధరలు హైదరాబాద్, సికింద్రాబాద్, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ఒకేలా ఉన్నాయి. బంగారం కొనాలుకునే వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండి హైదరాబాద్‌లో వెండి ధర 1 గ్రాము రూ.67.80 గా ఉంది. అదే… 8 గ్రాములు కావాలంటే ధర రూ. 542.40గా ఉంది.

అదే 10 గ్రాములు కావాలంటే… ధర రూ. 678 ఉంది. 100 గ్రాములు ధర రూ. 6,780 ఉండగా… కేజీ వెండి ధర… రూ.67,800గా ఉంది. వెండి వివిధ నగరాల్లో వాటి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి. బంగారం, వెండి ధరల్లో మార్పులను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయనే సంగతి తెలిసిందే. అందుకే నిత్యం బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago