టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దేవి శ్రీప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. దేవి శ్రీ ప్రసాద్ బాబాయ్ బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే గాయాలు అధికమవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి దేవి శ్రీ ప్రసాద్ బాబాయ్ మరణించడంతో దేవి ఇంట విషాదం నెలకొంది. తన బాబాయ్ మరణవార్త విన్న దేవి కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
ఇదిలా ఉండగా ఒక్క మరణవార్త వారిని కృంగదీస్తుందంటే మరొక మరణ వార్త విన్న దేవి శ్రీ కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలోకి నెట్టేసింది. దేవి శ్రీ ప్రసాద్ బాబాయ్ మరణవార్త విన్న తన మేనత్త మహాలక్ష్మి గుండెపోటుతో మరణించడంతో దేవి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకేసారి రెండు మరణ వార్తలతో దేవి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నటువంటి పుష్ప సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కాంబోలో తెరకెక్కినటువంటి ఆర్య, ఆర్య 2 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన సంగతి తెలుగుసిందే. ఈ క్రమంలోనే పుష్ప సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన
దాక్కో దాక్కో మేక పాట విడుదలవగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా, సంతోషంగా ఉన్న దేవి ఇంట తన బాబాయి, మేనత్త మరణవార్తతో విషాదం నిండిపోయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…