బంగారం అంటే ఇష్టపడని వారు అస్సలు ఉండరు. ఎక్కువ సంపాదన, డబ్బులు ఉన్నవాళ్లు ఎక్కువగా గోల్డ్ లో ఇన్ వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే బంగారం దాదాపు నెల రోజులతో పోల్చితే రూ.1600 వరకు తగ్గింది. వివరాల్లోకి వెళ్తే.. బంగారం ప్రియులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే.. గత కొన్ని నెలల నుంచి బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఏ రోజు ఎంత పెరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

అంతేకాకుండా బంగారం తీసుకోవాలని అనుకునే వారు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది. దాదాపు తులం బంగారం అంటే 10 గ్రాములు రూ.50 వేలు దాటేసింది. అయితే గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు దిగి వస్తున్నాయి. 10 గ్రామలు బంగారం ధరలు రోజుకు రూ.100 నుంచి రూ.200 చొప్పున దగ్గుకుంటూ వస్తున్నాయి. పోయిన నెల అంటే ఆగస్టు 15 నాటికి 10 గ్రాముల ధర (22 క్యారెట్స్) రూ.45 వేలు ఉండగా.. ప్రస్తుతం ఆ ధర రూ.
43,400 లకు చేరింది. ప్రస్తుతం ఈ ధరలు హైదరాబాద్, సికింద్రాబాద్, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ఒకేలా ఉన్నాయి. బంగారం కొనాలుకునే వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండి హైదరాబాద్‌లో వెండి ధర 1 గ్రాము రూ.67.80 గా ఉంది. అదే… 8 గ్రాములు కావాలంటే ధర రూ. 542.40గా ఉంది.
అదే 10 గ్రాములు కావాలంటే… ధర రూ. 678 ఉంది. 100 గ్రాములు ధర రూ. 6,780 ఉండగా… కేజీ వెండి ధర… రూ.67,800గా ఉంది. వెండి వివిధ నగరాల్లో వాటి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి. బంగారం, వెండి ధరల్లో మార్పులను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయనే సంగతి తెలిసిందే. అందుకే నిత్యం బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి.





























