ఎల్ఐసీ పాలసీదారుడు చనిపోతే… డబ్బులు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?

ప్రస్తుతం ఎల్‌ఐసీలో ఎదో ఒక పాలసీ చాలామందికి ఉండే ఉంటుంది. అయితే పాలసీదారుడు మధ్యలో మృతి చెందినట్లయితే ఆ ఇన్సురెన్స్ డబ్బులను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలియదు. నామినీ మాత్రమే క్లెయిమ్‌ చేసుకోవాలా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చేసుకోవచ్చా అనేది తెలియదు. అయితే దానికి ఒక ప్రాసెస్ ఉంది.

ఒకవేళ పాలసీదారుడు మధ్యలో చనిపోతే ఆ మొత్తం పాలసీ డబ్బులను నామినీ మాత్రమే తీసుకొనే అవకాశం ఉంటుంది. ఈ క్లెయిమ్‌ను కేవలం ఆఫ్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాడానికి ఎల్‌ఐసీ కల్పించింది. ముందుగా ఏజెంట్ ని సంప్రదించి సంతకం తీసుకొని హోమ్‌ బ్రాంచ్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. తర్వాత పాలసీదారుడు చనిపోయిన విషయాన్ని బ్రాంచ్‌ అధికారులకు తెలిపి.. ఫామ్‌ 3783, ఫామ్ 3801, నెఫ్ట్ ఫామ్‌ల‌ను నిపాల్సి వస్తుంది.

తర్వాత చనిపోయిన పాలసీదారుడి డెత్ సర్టిఫికెట్ మరియు అతడి ఒరిజినల్ ఎల్ఐసీ బాండ్ తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వాటిపై సంతకం చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా నామినీకి సంబంధించి పాన్ కార్డు, నామినీ ఆధార్ కార్డుపై సంతకం చేసి అధికారుల ఇవ్వాల్సి ఉంటుంది. ఓ లెటర్ లో చనిపోయిన పాలసీదారుడి ఇంటి అడ్రస్ తో మరికొన్నివివరాలను నింపి హోమ్ బ్రాంచ్ అధికారులకు సమర్పించాలి.

తర్వాత నామినీ బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి. దీనిలో ముఖ్యంగా హోమ్ బ్రంచ్ కు వెళ్లే సమయంలో డాక్యుమెంట్స్ సమర్పణలో ఒరిజినల్ ఐడీ కార్డులను వెంట తెచ్చుకోవాలి. చివరకు బ్యాంక్ ఒరిజిన‌ల్ పాస్ బుక్‌ను కూడా అధికారులు చెక్ చేశాక‌ అధికారులు డెత్ క్లెయిమ్‌కు సంబంధించిన అప్లికేష‌న్‌ను ఆన్‌లైన్‌లో స‌బ్మిట్ చేస్తారు. ఇలా నామినీ డెత్ క్లెయిమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.