హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్.. తెరాస అభ్యర్థి ఆయనే!

హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ త్వరలోనే వెలుబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 6,7 తేదిల్లో షెడ్యూల్ రావొచ్చునన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎన్నికల కమిషన్ కసరత్తు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రధాన రాజకీయ పార్టీలు కూడా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టమైన సకేంతాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే దళిత బంధు కార్యక్రమాన్ని కేసీఆర్ వాసాల మర్రి వేదికగా చకచకా ప్రకటించడం జరిగిందని వాదన వినిపిస్తోంది.

హుజూరాబాద్‌లో తెరాస,బీజీపీ మధ్యే ప్రధాన పోరు ఉండనున్నది. బీజేపీ నుంచి ఈటల బరిలో దిగనుండగా టీఆర్‌ఎస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ నెల 16వ తేదీన హుజురాబాద్‌ పర్యటన సందర్భంగా కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించవచే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు తెరాస టికెట్ దక్కనుందని తెలుస్తోంది. కేసీఆర్ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేశారనే ప్రచారం జరుగుతోంది.