Featured

Hyper Aadi: బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లాలని ఉన్న వెళ్లలేము.. అసలు విషయం చెప్పిన హైపర్ ఆది?

Published

on

Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర కమెడియన్ గా ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి హైపర్ ఆది ప్రస్తుతం వెండితెరపై కూడా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి హైపర్ ఆది తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

గతంలో బిగ్ బాస్ కార్యక్రమంలో హైపర్ ఆది సుడిగాలి సుదీర్ రష్మీ వంటి వారందరూ కూడా పాల్గొనబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ వీళ్లు మాత్రం బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టిన దాఖలాలు లేవు అయితే తాజాగా ఈ విషయం గురించి ఆది మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మేము ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో లలో పనిచేస్తూ ఉన్నాము అయితే ఇక్కడ మాకు అగ్రిమెంట్ ఉంటుందని ఈ కార్యక్రమాలలో తప్ప మేము ఇతర చానల్లో లాంగ్ టర్న్ షోస్ చేయకూడదని హైపర్ ఆది తెలిపారు. ఇలా అగ్రిమెంట్ లో ఉంటుందని ఈయన తెలిపారు. అయితే ఈ టీవీ షోస్ చేస్తూ సినిమాలు చేసే అవకాశాలు ఉంటాయి కానీ ఇతర షోస్ చేయడానికి మాకు అవకాశం లేదు.

Advertisement

అగ్రిమెంట్ ఉంటుంది…

ఒకవేళ ఇతర కార్యక్రమాలలో కనిపించాలి అంటే ఒకటి రెండు ఎపిసోడ్లకు మినహాయింపు ఉంటుంది కానీ లాంగ్ టర్మ్ షోస్ చేయాలి అంటే కుదరదని అందుకే మేము బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లడం కుదరదు అంటూ ఈ సందర్భంగా హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక తాను బిగ్ బాస్ కార్యక్రమంలోకి వన్డే ఎపిసోడ్ కి మాత్రమే అటెండ్ అవుతూ ఉంటాను తప్ప పూర్తిగా కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం తనకు లేదు అంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Trending

Exit mobile version