Nagarjuna: ‘సినిమా టికెట్ల రెట్లు తగ్గినా ఇబ్బంది లేదు’ నాగార్జున షాకింగ్ కామెంట్స్!

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున రమ్యకృష్ణ నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా సీక్వెల్ చిత్రంగా బంగార్రాజు చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.

జనవరి 14వ తేదీ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదల వాయిదా పడటంతో బంగార్రాజు చిత్రాన్ని విడుదల చేయడం కోసం చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తడంతో ఈ సినిమా విడుదల పై చిత్రబృందం క్లారిటీ ఇచ్చారు.

Nagaarjuna: సినిమా టికెట్ల విషయంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!

ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో మాట్లాడిన నాగార్జున ఈ సినిమా జనవరి 14 వ తేదీన విడుదలవుతుందని తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ల రేట్లు దారుణంగా తగ్గిపోయాయి.ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేస్తే నష్టం వస్తుందని చాలా మంది ఈ సమస్యపై పోరాడుతున్నారు. ఈ విషయంపై కూడా నాగార్జున స్పందించారు.

Nagarjuna : టికెట్ల రేట్లు పెంచితే చాలా మంచిది..

ప్రస్తుతం ఏపీలో టికెట్లు రేట్లు తగ్గించడం వల్ల తన సినిమాకు ఏ విధమైనటువంటి ఇష్టం లేదని నాగార్జున తన అభిప్రాయం వ్యక్తం చేశారు. టికెట్లరేట్లు తగ్గించడం వల్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే టికెట్లు రేట్లు పెంచితే మరింత లాభం వస్తుందని నాగార్జున టికెట్ల విషయం పై తన అభిప్రాయాన్ని ప్రకటించారు. నాగార్జున ఈ అభిప్రాయం చూస్తుంటే తప్పకుండా ఈ సినిమాని జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య నాగార్జున నటించగా రమ్యకృష్ణ కృతి శెట్టి హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.