రోగనిరోధక శక్తి పెంచుకోవాలా.. అయితే వీటిని తీసుకోండి..!

మన పూర్వికులు తినే ఆహారంలో పుష్కలంగా పోషకాలు, విటమిన్లు, ఖనిజలవణాలు ఉండే విధంగా ఆహార పదర్థాలు తినేవారు. కానీ కాలం మారింది. ప్రస్తుతం ఉరుకుల ప్రపంచంలో కనీసం ఆరోగ్యంపై శ్రద్ధ వహించే తీరిక లేకుండా పోయింది. ప్రస్తుతం వ్యవసాయంలో కూడా పండించే పంట కూడా మొత్తం ఎరువులమయం అయిపోయింది. తింటే రోగం.. తినకపోతే నీరసం.

ఇలాంటి దుస్థితి ఏర్పడింది. మన తాతలు, బామ్మలు, అమమ్మలు తిన్న తిండేనే ఇప్పుడు మనమూ ఇష్టపడుతున్నాం. సామలు, అరికెలు కొర్రలు, అండు కొర్రలు, ఊడలు అంటూ వీటి వెంట పడుతున్నాం. ఈ మార్పు ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సైతం చెబుతున్నారు. ప్రతీ ఒక్కరు చిరుధాన్యాలు తినేందుకు కూడా ఎక్కువగా మొగ్గు చూపతున్నారు.

దీనికి గల కారణం ఏంటంటే.. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వీటిని మనం తినే ఆహారంలో భాగంగా చేసుకుంటే.. వైద్యుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. వ్యాధుల నుంచి రక్షించుకోవడం కోసం ఆహారపు అలవాట్లలో మార్పులు అనివార్యంగా మారింది. బరువు తగ్గేవారు రాగుల్లో ట్రిప్టోథాన్ అనే అమైనో ఆమ్లం ఉపయోగపడుతుంది. అందువల్ల రాగులు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కడుపులో అల్సర్ వంటివి తగ్గించడంలో చిరుధాన్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మలబద్దకం ఉన్న వారికి చిరుధాన్యాలు ఒక ఔషదంగా పనిచేస్తుంది. వీటిని రోజూ వారి ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు.. త్వరగా ముసలితనం రాకుండా కూడా సహకరిస్తాయి.