Yandamuri Veerendranath: ఆ రోజుల్లో కమల్ హాసన్ శ్రీదేవి రెమ్యూనరేషన్ 2 లక్షలే… చిరంజీవికి కూడా లాభాల్లో…

Yandamuri Veerendranath: యండమూరి వీరేంద్రనాథ్ ఒక రచయితగా, వ్యక్తిత్వ వికాస బోధకుడిగా అందరికీ సుపరిచితమే. ఇలా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యండమూరి ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొని సినీ ఇండస్ట్రీ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు రెమ్యునరేషన్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

Yandamuri Veerendranath: ఆ రోజుల్లో కమల్ హాసన్ శ్రీదేవి రెమ్యూనరేషన్ 2 లక్షలే… చిరంజీవికి ఎంతంటే?

ప్రస్తుత కాలంలో రచయిత కైనా, దర్శకుడైనా హీరోయిన్లకైనా సినిమా లాభాలలో వాటా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అప్పట్లో మీరు కూడా సినిమా లాభాలలో వాటా తీసుకునేవారా అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు యండమూరి సమాధానం చెబుతూ అప్పట్లో ఇలాంటి వాటాలు అనేది ఏమీ లేవు కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే ఉండేదని తెలియజేశారు.

Yandamuri Veerendranath: ఆ రోజుల్లో కమల్ హాసన్ శ్రీదేవి రెమ్యూనరేషన్ 2 లక్షలే… చిరంజీవికి ఎంతంటే?

తాను అభిలాష సినిమాకు పని చేసినందుకు గాను పాతిక వేలు ఇచ్చారని అలాగే స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమాకి డైలాగ్ రైటర్, స్క్రిప్ట్ స్క్రీన్ప్లే అందించినందుకు నాకు రెండు లక్షల యాభై వేల రూపాయల పారితోషికం ఇచ్చారు. అప్పట్లో ఎలాంటి వాటాలు లేవని ఈ సందర్భంగా యండమూరి వెల్లడించారు.

అందరికీ రెమ్యూనరేషన్ ఇచ్చేవాళ్ళు…

ఇకపోతే అప్పట్లో రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువగా ఉండేవి అయితే ఆ సమయానికి అతి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అంటూ యండమూరి వెల్లడించారు. ఒక రాధ ఇద్దరు కృష్ణులు సినిమాకు కమల్ హాసన్, శ్రీదేవి రెండు లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని ఈ సందర్భంగా యండమూరి తెలిపారు. అప్పట్లో ప్రతి ఒక్కరికి రెమ్యూనరేషన్ ఇచ్చే వాళ్ళని ఎవ్వరికీ వాటాలు లేవని వెల్లడించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయన కూడా సినిమాకు రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకునేవారని ఎలాంటి లాభాలలో భాగం ఉండేది కాదని ఈ సందర్భంగా తెలిపారు.