Sreekanth Reddy: గురువారం సాయంత్రం నటి కరాటే కళ్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ పై దాడి చేసిన సంగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో ఈ దాడి వెనక గల కారణం ఏంటి అంటూ పలువురు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలోనే కరాటే కళ్యాణి దాడిలో గాయపడిన శ్రీకాంత్ రెడ్డి తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయం గురించి స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గురువారం సాయంత్రం 9 గంటల సమయంలో కరాటే కళ్యాణి తనతో పాటు ముగ్గురు అబ్బాయిలు తీసుకొని మా ఇంటికి వచ్చారు. బయటనుంచి గట్టి గట్టిగా అరుస్తూ ఉండడంతో బయటకి వెళ్ళాను.బయటకు వెళ్ళగానే నువ్వు సమాజంలో ఆడవాళ్ళ పట్ల ఎంతో అసభ్యకరమైన ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నావ్ అంటూ నన్ను తిట్టారు. ఆమె అలా అనడంతో మీరు కూడా సినిమాల్లో చేస్తున్నారు కదా అంత కన్నా దారుణమైనవి కాదు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే చేస్తున్నానని చెప్పినట్లు శ్రీకాంత్ వెల్లడించారు.
నా ఫ్రాంక్ వీడియోలు ద్వారా ఏ మహిళ ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదు వాళ్ళకు డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నాను అంటూ శ్రీకాంత్ ఈ సందర్భంగా తెలియజేశారు. అమ్మాయిలు కూడా వారికంటూ గుర్తింపు రావాలని ఇలాంటి ఫ్రాంక్ వీడియోలలో చేస్తున్నారని శ్రీకాంత్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను మహిళా సంఘాలకు ఫిర్యాదు చేస్తాను నీ పై చర్యలు తీసుకుంటాను అంటూ నన్ను బెదిరించారు. అలా జరగకుండా ఉండాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని సూచించారు. ఇలా డబ్బులు నేనెందుకు ఇస్తానని తనతో గొడవకు దిగగా తన పక్కన ఉన్న ఒక వ్యక్తి నన్ను పక్కకు తీసుకెళ్లి భుజంపై చేయి వేసి 70 వేలకు సెట్ చేస్తాను అనవసరంగా గొడవ ఎందుకు అంటూ మాట్లాడారు. అయితే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని ఒకవేళ మహిళలు అభ్యంతరకరంగా ఫీల్ అయితే వాళ్లు నా పై కంప్లైంట్ చేస్తారు అంటూ తనకు ఎదురు తిరగడంతో వాళ్ళు తనపై దాడి చేశారని ఈ సందర్భంగా శ్రీకాంత్ ఈ వీడియో ద్వారా తన పై జరిగిన దాడి గురించి తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…