దేశంలో కరోనా విలయతాండవం.. కేసులు, మరణాలలో భారత్ సరికొత్త రికార్డు!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తోంది. ఈ వైరస్ సృష్టిస్తున్న ప్రళయానికి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండవ దశలో రెట్టింపు వేగంతో దూసుకుపోతున్న ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే కేసుల సంఖ్య రోజుకు లక్షల్లో నమోదవుతున్నాయి.

మంగళవారం ఒక్కరోజే మనదేశంలో మూడు లక్షల కేసులు నమోదయ్యాయి అంటే వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో 2. 95 లక్షల పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, మరణాల సంఖ్య రోజుకు 2000 పైగానే జరుగుతోందని తెలియదు. అయితే గతేడాది నుంచి ఈ స్థాయిలో కేసులు ఎప్పుడు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు సంఖ్య 1,56,16,130కి చేరగా, కరోనా మృతుల సంఖ్య 1,82,553కి చేరింది. మరణాల రేటు 1.18శాతంగా కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువగా వ్యాపిస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్ ,మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో కేసుల సంఖ్య అధికమవుతున్నాయి.

అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటకలో కూడా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
తాజా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 62,097, కేసులు నమోదు కాగా యూపీలో 29,754 కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో కూడా 28,395, నమోదయ్యాయి. ఇక దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటకలో 21,794 కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 6,542 కొత్త కేసులు నమోదు కాగా.. 20 మంది ప్రాణాలు కోల్పోయారు