లాటరీలో 20 కోట్లు గెలిచాడు… కానీ ఆ డబ్బును అందుకోలేక పోతున్నాడు… కారణం అదే!

సాధారణంగా కొందరికి అదృష్టం తలుపు తడితే రాత్రికి రాత్రే కోటీశ్వరుడుగా మారిపోతుంటారు మరికొందరికి దురదృష్టం వెంటాడితే ఎన్ని కోట్లు ఉన్న రాత్రికి రాత్రే బిచ్చగాడిగా మారిపోతారు. అయితే మీరెప్పుడైనా ఒకే వ్యక్తికి అదృష్టం దురదృష్టం వెంటవెంటనే రావడం గురించి విన్నారా. అయితే ఈ కేరళకు చెందిన వ్యక్తికి జరిగిన విషయం గురించి తెలుసుకోవాల్సిందే.

కేరళకు చెందిన నహీల్ అనే వ్యక్తి గత కొంత కాలంగా దుబాయిలో నివసిస్తున్నారు. సెప్టెంబర్ 26న నహీల్ ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.ఈ టిక్కెట్ కొనుగోలు చేసే సమయంలో అతని అడ్రస్ కేరళ ఇవ్వగా అలాగే అతని ఫోన్ నెంబర్ లు రెండు ఇచ్చాడు. ఈ క్రమంలోనే లాటరీ నిర్వాహకులు ఆదివారం జరిగిన బిగ్ టికెట్ అబూదాబి సిరీస్‌ 232 లాటరీ డ్రాలో అతడు ఏకంగా 10 మిలియన్ దుబాయ్ దిర్హామ్‌లు గెలిచాడు.

మన భారత కరెన్సీ ప్రకారం అతను లాటరీలో ఏకంగా 20 కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు.ఇలా 20 కోట్లను గెలుచుకున్న విషయాన్ని లాటరీ నిర్వాహకులు అతనికి తెలియ చేయాలని అతను ఇచ్చిన ఫోన్ నెంబర్లకు ఫోన్ ప్రయత్నించడంతో ఆ రెండు సెల్ నెంబర్లు పని చేయకపోవడం గమనార్హం.

ఈ క్రమంలోనే కేరళకు చెందిన నహీల్ నిజాముద్దీన్ కు తను లాటరీలో గెలిచిన 20కోట్ల విషయం తనకు ఇప్పటికీ తెలియదని ఎలాగైనా ఈ విషయాన్ని తనకు చేరవేసే వరకు మా ప్రయత్నం చేస్తూనే ఉంటానని లాటరీ నిర్వాహకులు తెలియజేశారు.దీన్ని బట్టి చూస్తే అదృష్టం దురదృష్టం రెండు తనని వెంటాడుతున్నాయని చెప్పవచ్చు.ఏదిఏమైనప్పటికీ 20 కోట్లు గెలుచుకొని తను పొందకపోవడం నిజంగానే దురదృష్టం.