Categories: Featured

అప్పుడు డైరెక్టర్ క్రిష్ మీద వచ్చింది రూమరే.. కానీ ఆ స్టార్ హీరో, హీరోయిన్ ఫ్యాన్స్ మాత్రం బాగా హర్ట్ అయ్యారు..!

తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు క్రిష్ ( జాగర్ల మూడి రాధాకృష్ణ ). గమ్యం సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్, అల్లరి నరేష్, కమిలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో క్రిష్ కూడా కనిపించాడు. కమర్షియల్ అంశాలను అలా టచ్ చేసి చేయనట్టుగా గమ్యం సినిమాను తెరకెక్కించి డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్ హీరోలనే కాదు అనుష్క శెట్టి లాంటి స్టార్ హీరోయిన్స్‌ను బాగా ఆకట్టుకున్నాడు.

మొదటి సినిమా హిట్ అవడంతో అల్లు అర్జున్, మంచు మనోజ్ లాంటి హీరోలతో క్రిష్ సినిమా చేయాలనుకున్నాడు. అప్పటికే వేదం కథ సిద్దం చేసుకున్న క్రిష్ మంచు మనోజ్‌తో
కథ డిస్కస్ చేసి ఓ పాత్రకి ఫైనల్ చేసుకున్నాడు. ఇందులో మరో పాత్రకి అల్లు అర్జున్ చేయాల్సి ఉండగా అప్పుడు బిజీగా ఉన్న అల్లు అర్జున్ చేస్తాడో లేదో అని సందేహంగా వెళ్ళి కలిశాడు. క్రిష్ చెప్పిన కథ, అందులో అల్లు అర్జున్ పోషించాల్సిన పాత్ర విపరీతంగా నచ్చడంతో ఏమాత్రం ఆలోచించకుండా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇలా ఇద్దరు యంగ్ హీరోలను సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేసుకున్న క్రిష్‌కి అసలు సవాల్ ఇప్పుడే ఎదురైంది.

వేదం సినిమాలో ముఖ్య పాత్ర హీరోయిన్‌ది. ఆ పాత్ర ఓ వేశ్య పాత్ర. ఇలాంటి పాత్ర అనుష్క చేస్తుందా అని క్రిష్‌కి పెద్ద డౌట్. అయితే అల్లు అర్జున్ మాత్రం నువ్వు రాసుకున్న క్యారెక్టర్‌కి స్వీటీ అయితే పర్‌ఫెక్ట్‌గా సూటవుతుంది. వెళ్ళి చెప్పు అని బన్నీ సపోర్ట్ చేశాడు. అనుకున్నట్టుగానే క్రిష్.. అనుష్క శెట్టి అపాయింట్‌మెంట్ తీసుకొని వెళ్ళాడు. కానీ అప్పటికే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న అనుష్క ముందు కూర్చొని మీది వేశ్య పాత్ర అని చెప్పడానికి క్రిష్ తెగ ఇబ్బంది పడ్దాడు. అసలు విషయం చెప్పకుండా అదీ ఇదీ అని ఏదో కన్‌వే చేయబోతుంటే.. ఓకే ప్రాస్టిస్ట్యూట్.. పర్లేదు చెప్పండి అని తనే లీడ్ ఇచ్చి కథ నరేట్ చేయమని ఎంకరేజ్ చేసింది.

అలా వేదం కథ మొత్తం నరేట్ చేశాక అనుష్క చాలా ఎమోషనల్ అయి ఏడుస్తూ కూర్చుందట. కొన్ని క్షణాలు క్రిష్ కి ఏమీ అర్థం కాక మీకు కథ నచ్చలేదా.. ఓకే మీరు చేయకండి అన్నాడట. కానీ అనుష్క ..లేదు లేదు నీ ఈ సినిమా చేస్తాను అని కమిటయింది. వేదం సినిమా షూటింగ్ అయినన్ని రోజుల్లో క్రిష్ – అనుష్క శెట్టిల మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం క్రిష్ – అనుష్క పెళ్ళి చేసుకోబోతున్నారని వార్తలు రాసుకొచ్చారు. అప్పట్లో ఈ వార్త పెద్ద హాట్ టాపిక్‌గా మారింది కూడా. అంతేకాదు అప్పటికే ప్రభాస్, అనుష్క పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వాళ్ళు క్లారిటీ ఇచ్చినా వార్తలు రాసేవారు రాస్తూనే ఉన్నారు. అటు ప్రభాస్, ఇటు అనుష్క అభిమానులు కొందరూ నిజంగా ప్రభాస్ – అనుష్క ఒక్కటైతే బావుండు అనుకున్నారు కూడా. మధ్యలో ఈ వార్త రాగానే ఇద్దరి ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. అయితే రాను రాను ఇవన్నీ కేవలం రూమర్సే అని క్లారిటీ వచ్చింది. కానీ ఇలాంటి రూమర్స్ వల్ల స్టార్స్ మాత్రమే కాదు అభిమానులు బాగానే హర్ట్ అవుతారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago