Movie News

నాలుగు వారాలకు నటరాజ్ మాస్టర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

తెలుగు బిగ్ బాస్ 5 గత నెలలో 19 మంది కంటెస్టెంట్ ల తో ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యి ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ తమదైన శైలిలో ఆడుతూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ కోసం నువ్వా నేనా అంటూ పోటీపడుతూ గొడవలు పడుతూ చివరకు కొట్టుకొనే వరకు వెళ్తూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతారు.

బిగ్ బాస్ కార్యక్రమం అంటేనే కొట్లాటలు గొడవలు ఉన్నట్టుగానే ఎలిమినేషన్ కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే 19 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం 15 మంది కంటెస్టెంట్ లు ఉండగా నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగవ వారం ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ నుంచి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవడంతో అందరూ షాక్ అయ్యారు.

హౌస్ నుంచి బయటకు వెళ్లిన నట రాజ్ మాస్టర్ నాగార్జునతో మాట్లాడుతూ ఏదో సాధించాలని హౌస్ లోకి వచ్చాను ఏమి సాధించకుండానే వెళ్తున్నా అని చెప్పగా ప్రస్తుతం నీ భార్యకు నీ అవసరం ఎంతో ఉంది తన కోసమే నిన్ను దేవుడు బయటకు పంపించాడేమో అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నట రాజ్ మాస్టర్ భార్య నీతూ ప్రెగ్నెంట్ అన్న సంగతి మనకు తెలిసిందే.

ఇక నాలుగు వారాల పాటు హౌస్ లో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన నట రాజ్ మాస్టర్ చివరి వారంలో సభ్యులను తనదైన శైలిలో జంతువులతో పోలుస్తూ అందరిని కామెంట్స్ చేయడంతో ఈయనపై నెగిటివిటీ ఏర్పడింది. ఈ నెగిటివిటీ కారణంగానే నటరాజ్ మాస్టర్ హౌస్ నుంచి బయటకు వచ్చారని తెలుస్తోంది.ఇకపోతే నాలుగు వారాలకు గాను బిగ్ బాస్ నట రాజ్ మాస్టర్ కు ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించారన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ముందుగా కుదుర్చుకున్న డీల్ ప్రకారం నటరాజ్ మాస్టర్ కు రోజుకు పదిహేను వేలు చొప్పున రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే వారానికి లక్షకుపైగా నట రాజ్ మాస్టర్ రెమ్యూనరేషన్ తీసుకున్నారని, నాలుగు వారాలకు గాను నాలుగు లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రేక్షకులను మరింత టైం చేసినందుకుగాను బిగ్ బాస్ నిర్వాహకులు మాస్టర్ కు మరికొంత ఎక్కువ రెమ్యూనరేషన్ చెల్లించి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago