Infant baby Record : నోబెల్ రికార్డు కొట్టిన ఆరు నెలల బుడ్డోడు…!

Infant Baby Record : అతి చిన్న వయసులోనే నోబెల్ రికార్డు సాధించాడు ఒక బుడ్డోడు. అది కూడా సంవత్సరం కూడా నిండని పసి పిల్లాడు రికార్డు సాధించడం ఏమిటి అనే సందేహం వస్తుంది. ఆరు నెలల పిల్లాడు తన చుట్టూ ఉండే కుటుంబ సభ్యులను గుర్తుపట్టడమే గొప్ప విషయం. కానీ ఏ ఈ బుడ్డోడు ఏకంగా పక్షులు, జంతువుల బొమ్మలను అంకెలను ఇలా తన తల్లి ఏది అడిగితే అది చూపించి అబ్బురపరుస్తున్నాడు.

ప్రజ్వల్ ప్రతిభకు అవార్డు…

కడప జిల్లా ప్రొద్దుటూరు శాస్త్రి నగర్ కి చెందిన సౌమ్య, పవన్ కుమార్ దంపతులకు ఆరు నెలల బాబు ఉండగా బాబు ప్రజ్వల్ ను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పసి బిడ్డగా ఉన్నప్పటి నుండి ప్రజ్వల్ కు పక్షులు, జంతువుల బొమ్మలను చూపడం వాటిని అలవాటు చేసిన తల్లి వాటిని గుర్తుపట్టే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు.

అలా ఆరు నెలల ప్రాయంలోనే ప్రజ్వల్ ఏ జంతువు, అంకెలు ఇలా ఏది అడిగితే ఆ బొమ్మను గుర్తుపట్టి చేత్తో పట్టుకుని చూపుతాడు. ఇదంతా తండ్రి పవన్ కుమార్ చరవాణిలో వీడియో తీసి నోబెల్ రికార్డు వారికి పంపగా వారు ప్రజ్వల్ ప్రతిభను గుర్తించి ఆన్లైన్ ద్వారా అవార్డును పంపారు. ప్రపంచ రికార్డును ప్రజ్వల్ ఆరు నెలల వయసులోనే అందుకుని అరుదైన ఘనత సాధించాడు.