దూరదర్శన్ సీరియల్ గా రిజెక్ట్ చేశారు.. కానీ సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇలాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం” ఒకటి. పూరి జగన్నాథ్ ఈ సినిమాను కే బాలచందర్ తెరకెక్కించిన ఒక సినిమా ఆధారంగా కొద్దిగా స్క్రిప్ట్ లో మార్పులు చేసి తెరకెక్కించారు.-ఈ కథకు ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ అనే టైటిల్ పెట్టి ఈ కథను దూరదర్శన్ లో సీరియల్ గా తీసుకువెళ్తే అక్కడ రిజెక్ట్ చేశారు.

ఈ విధంగా దూరదర్శన్లో రిజెక్ట్ అయిన ఈ సినిమాకు కొండచరియ అనే టైటిల్ పెట్టి పంపినప్పటికీ రిజెక్ట్ అయింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బద్రి’ సినిమా కన్నా ముందు పవన్ కళ్యాణ్ కి చెప్పిన సినిమా కథ ఇదే. ఈ విధంగా పలు కారణాల వల్ల ఈ సినిమా రిజల్ట్ కావడంతో ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ కథను పూర్తిగా పక్కన పెట్టారు. ఆ తర్వాత జరిగిన ‘బాచీ’ అనే సినిమా పరాజయం కావడంతో ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ మళ్లీ తెరపైకి వచ్చింది.

ఈ సినిమా స్క్రీన్ ప్లే లో కొద్దిగా మార్పులు చెప్పి హీరో సుమంత్ దగ్గరికి వెళ్ళారు. కథ విన్న సుమంత్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. అదేవిధంగా తరుణ్ దగ్గరికి వెళ్తే తల్లి రోజా రమణి ఈ కథకు నో చెప్పారు. ఇక చివరిగా ఈ కథ రవితేజ హీరోగా చేయాలని భావించినప్పుడు ఈ సినిమాను నిర్మించడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే రవితేజకు ఎంతో సన్నిహితంగా ఉండే న్యాయవాదులు వేణుగోపాల్ రెడ్డి, శేషు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు.

ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా ఒకరు ప్రత్యూష. అయితే ఈమెకు తమిళంలో అవకాశాలు రావడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్స్ గా తనూరాయ్, సమ్రీన్ నటించగా చక్రి సంగీతం అందించారు. ఇక అన్ని సమకూర్చగానే 2001 ఫిబ్రవరి 24న షూటింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రకటనలో భాగంగా “మాకు 32 కష్టాలు మా చావుకు ఎవరూ కారణం కాదు” అనే క్యాప్షన్ అందరిని ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే కేవలం 45 రోజులలో సినిమా షూటింగ్ పూర్తిచేసి విడుదల చేయగా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సృష్టించిందని చెప్పవచ్చు. దూరదర్శన్ లో రిజెక్ట్ అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లు రాబట్టడం రికార్డు అని చెప్పవచ్చు.