Movie News

మీనా లైఫ్ లో చేసిన సరిదిద్దుకోలేని తప్పులు ఏంటో తెలుసా !?

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో హీరోయిన్లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే అప్పట్లో చాలామంది హీరోయిన్లు హీరోలతో పాటు సమానమైన క్రేజ్ ను సంపాదించుకొని సినిమా విజయంలో కీలక పాత్రను పోషిస్తూ ఉండేవారు. అలాంటి వాళ్ళలో సౌందర్య లాంటి హీరోయిన్లు మొదటి వరుసలో ఉంటే రమ్యకృష్ణ, మీనా లాంటి హీరోయిన్లు ఆమె తర్వాత అంత గొప్ప విజయాలను అందుకొని నటులుగా మంచి గుర్తింపు సాధించుకున్నారు.

ముఖ్యంగా మీనా అయితే ‘సీతారత్నం గారి మనవరాలు’ సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సాధించుకున్నారు. ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోలందరితో సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలందరితో అప్పట్లో చాలా సినిమాల్లో నటించి నటులుగా మంచి గుర్తింపు సాధించుకున్నారు. అప్పట్లో వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కూడా మీనా మంచి గుర్తింపు సాధించుకున్నారు. అయితే వాళ్ళ అమ్మ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ఇండస్ట్రీకి పంపించారు అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే తన డేట్స్ కావాలంటే వాళ్ళ అమ్మని అడగాల్సిందే. వాళ్ళ అమ్మ ఎలా చెప్తే అలా వినేది మీనా. అందులో భాగంగానే చాలా సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాల్సిన మీనా కొన్ని సినిమాలను మిస్ చేసుకుంది.

అందులో చాలా సినిమాలు ఉన్నప్పటికీ ఒక రెండు సినిమాలు మిస్ చేసుకున్నందుకు మాత్రం మీనా ఇప్పటికీ చాలా బాధపడుతూ ఉంటారు. అందులో మొదటిది కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘నిన్నే పెళ్ళాడుతా’ సినిమాలో మీనా నే హీరోయిన్ గా తీసుకుందాం అనుకున్నారు. ఆవిడకి స్టోరీ కూడా చెప్పారు. నాగార్జున కూడా అప్పటికే సక్సెస్ లో ఉన్న మీనానే హీరోయిన్ గా ఫిక్స్ చేద్దాం అని చెప్పారట. ఇద్దరూ కలిసి స్టోరీ అ చెప్పారు ఆ స్టోరీ మీనాకి నచ్చింది. దాంతో ఆ సినిమా చేయడానికి ఒప్పుకుంది కానీ ఆ సినిమా కోసం కృష్ణవంశీ 60 రోజులు డేట్స్ అడిగితే మీనా వాళ్ళ అమ్మ కుదరదు అని చెప్పి 20 రోజులు ఇస్తా ఇష్టం చేయండి లేకపోతే కుదరదు అని చెప్పడంతో కృష్ణవంశీ హీరోయిన్ గా టబుని తీసుకున్నాడు. సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించడంతో హీరోయిన్ గా టబు కి మంచి పేరు వచ్చింది. అయితే మీనా ఆ సినిమా చూసిన ప్రతిసారి చాలా బాధ పడుతూ ఉంటారని చెబుతూ ఉంటారు.

అలాగే ఈ సినిమా తర్వాత కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘నరసింహ’ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన పాత్ర కోసం మొదటగా మీనాని అడిగారు ఆ కథని మీనా కి చెప్పిన దర్శకుడు నీలాంబరి క్యారెక్టర్ ని డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంతో మీనాకి కూడా డైరెక్టర్ చెప్పిన కథలో నీలాంబరి క్యారెక్టర్ బాగా నచ్చి చేస్తాను అని చెప్పింది. కానీ అప్పటికే తను హీరోయిన్ గా టాప్ లో ఉంది అలాంటప్పుడు నెగెటివ్ క్యారెక్టర్ లో చేయడం కరెక్ట్ కాదని వాళ్ళ అమ్మ చెప్పడంతో ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రమ్యకృష్ణ సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. నరసింహ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్బస్టర్ హిట్ గా మిగిలింది.

ముఖ్యంగా రమ్యకృష్ణ పోషించిన పాత్ర కి రజనీకాంత్ కంటే ఎక్కువ పేరు వచ్చిందని చెప్పాలి. ఇలాంటి మంచి సినిమా మిస్ చేసుకున్నందుకు కూడా మీనా ఇప్పటికీ చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు చాలా సినిమాల్లో వారు చేయాల్సిన క్యారెక్టర్ లను మిస్ చేసుకుంటూ వాళ్లకు రావాల్సిన క్రేజ్ వేరే వాళ్ళకి వచ్చింది అని బాధపడుతూ ఉంటారు…

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago