1990 దశకం ఈ సంవత్సరం అనేక విజయవంతమైన చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమ కళకళలాడిందని చెప్పవచ్చు. మూడు రకాలైన సినిమాలు సినీ ప్రేక్షకులను ఉత్తేజ పరచాయి. జగదేకవీరుడు అతిలోకసుందరి, బొబ్బిలిరాజా, కర్తవ్యం ఈ మూడు చిత్రాలు బాక్స్ ఆఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించాయి.
సురేష్ ప్రొడక్షన్స్ వారు వెంకటేష్ హీరోగా ఒక సినిమా చేయాలనుకున్నారు. ఆ క్రమంలో కథ కోసం పరుచూరిబ్రదర్స్ ను సంప్రదించారు. ముందుగా ఒక కలెక్టర్ నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథా చిత్రాన్ని పరుచూరి బ్రదర్స్ చెప్పారు. దానికి అంతగా స్పందించని సురేష్ ప్రొడక్షన్స్ వారు అడవి నేపథ్యంలో ఓ కథ కావాలన్నారు. అలాంటి సమయంలో వారు అడవి నేపథ్యంతో “బొబ్బిలిరాజా” కథను చెప్పడంతో సురేష్ ప్రొడక్షన్స్ వారు అంగీకరించి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు. అలాంటి కథకు దర్శకుడు ఎవరైతే బాగుంటుందని నిర్మాత సురేష్ బాబు అడగడంతో తమ బ్యానర్ లో పరిచయమైన బి.గోపాల్ బాగుంటుందని పరుచూరి బ్రదర్స్ చెప్పారు. బి.గోపాల్ ను తీసుకుందామని అనుకున్నప్పటికీ ఈ కథలో వచ్చే ప్రేమతో కూడిన సన్నివేశాలను హీరో, హీరోయిన్ల మధ్య బి.గోపాల్ చక్కగా చిత్రించ గలడా అనే సందేహం నిర్మాత సురేష్ బాబుకి వచ్చింది. కానీ పరుచూరి బ్రదర్స్ నచ్చజెప్పడంతో బి.గోపాల్ ని తీసుకోవడానికి సురేష్ బాబు ఒప్పుకున్నారు.
ఈ సినిమా మొత్తం అత్త పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది. కావున కథలో బలమైన అత్త పాత్ర కు ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్న క్రమంలో ముందుగా శారదను అనుకున్నారు కానీ అంతకుముందే అత్త పాత్రలు వేయడంతో ఆమె స్థానంలో వాణిశ్రీ ని తీసుకున్నారు. అయితే ఈ సినిమాకి రచయిత, దర్శకుడు, హీరో ఎంపిక జరిగింది కానీ హీరోయిన్ గా ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్న క్రమంలో “రాధ” అయితే బాగుంటుందని డి.రామానాయుడు సూచించారు. కానీ పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి ఒక కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పడంతో ముంబైలోని బోనికపూర్ కి ఫోన్ చేసి తాము తీయబోయే కొత్త సినిమాకి హీరోయిన్ కావాలని చెప్పడంతో కొన్ని ముంబైలోని హీరోయిన్స్ ఫొటోస్ ని పంపించడం జరిగింది.
సురేష్ ప్రొడక్షన్ ఆఫీసులో ఫోటోస్ చూస్తున్న క్రమంలో దివ్యభారతి ఫోటోను చూసి ఈ అమ్మాయి బాగుంది, మన సినిమాల్లో హీరోయిన్ గా ఈ అమ్మాయిని పెట్టేద్దాం అని రచయిత గోపాలకృష్ణ అనడంతో నిర్మాత సురేష్ బాబు, హీరో వెంకటేష్ కూడా ఒప్పుకున్నారు. అలా ఈ సినిమాలో దివ్యభారతి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఆ తర్వాత సినిమా విడుదల విజయవంతం అయ్యింది. ఆ తర్వాత చిరంజీవితో రౌడీ అల్లుడు, మోహన్ బాబుతో అసెంబ్లీ రౌడీ, చిట్టెమ్మ మొగుడు, బాలకృష్ణతో ధర్మక్షేత్రం లాంటి హిట్ చిత్రాల్లో దివ్యభారతి నటించింది. అలా వివిధ రకాలైన సినిమాలలో నటిస్తూ తన సిని పరంపరను కొనసాగిస్తూ.. ప్రశాంత్ హీరోగా “తొలిముద్దు” సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న క్రమంలో ఆమె ముంబైలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…