Featured

‘వకీల్ సాబ్‌’లో అది మిస్ అయింది అందుకే బుల్లితెరపై టాప్ 10 లో నిలవలేకపోయింది..

రాజకీయాలలోకి వెళ్ళిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేయనని పదే పదే చెప్పిన విషయం తెలిసిందే. ఆయన ఎన్నిసార్లు చెప్పినా అభిమానులు మాత్రం ఒప్పుకోలేదు. మీరు రాజకీయాలలో ఉండాలి..సినిమాలు చేయాలి. మళ్ళీ మీరు మా కోసం సినిమాలు చేయాల్సిందే అనే రేంజ్ లో ఆయన ఎక్కడ పార్టీ మీటింగ్ పెట్టినా ఫైనల్ గా ఎదురైన ప్రశ్న ఇదే. అభిమానులు ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలలోకి వచ్చి పవర్ స్టార్ గా సత్తా చాటాలని బలంగా కోరుకున్నారు. ఆయన సినిమాలు మానేస్తున్నా అని చెప్పిన మాట ఎవరూ జీర్ణించుకోలేకపోయారు.

అందుకే ప్రతీ ఒక్కరు బలంగా కోరుకున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ డిసైడయి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తూ ‘వకీల్ సాబ్’ సినిమా చేశారు. పవన్ తన కెరీర్‌లోనే ఇలాంటి సినిమా చేయడం మొదటిసారి. మరీ ముఖ్యంగా ఇప్పటికే రెండు భాషలలో వచ్చిన సినిమాను ఇంతవరకు మళ్ళీ చేయలేదు. బాలీవుడ్‌లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ సినిమా ‘పింక్’కి తెలుగులో అఫీషియల్ రీమేక్‌గా ‘వకీల్ సాబ్’ రూపొందించిన సంగతి తెలిసిందే. మధ్యలో ఇదే కథ కోలీవుడ్‌లో స్టార్ హీరో అజిత్ కుమార్ నటించాడు.

అక్కడ ‘నెర్కొండ పార్వై’ అనే టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాను హెచ్.వినోద్ రూపొందించగా, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ నిర్మించారు. అటు అమితాబ్, ఇటు అజిత్ క్యారెక్టర్‌ని ఆధారంగా చేసుకొని ఇక్కడ మన నేటివిటీకి పవర్ స్టార్ ఇమేజ్‌కి తగ్గట్టు ‘వకీల్ సాబ్‌లో’ ఆయన పాత్రను దర్శకుడు వేణు శ్రీరామ్ డిజైన్ చేశారు. కథలో పవన్ పాత్రతో పాటు నివేథ థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్ పాత్రలను అద్భుతంగా మలిచారు.

ఇక ‘వకీల్ సాబ్’ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రిలీజ్ చేసినప్పటి నుంచే పవన్ మ్యానియా మొదలయింది. ఆ అంచనాలను సినిమా థియేట్రికల్ రిలీజ్ దగ్గరపడే వరకు ఊహించని విధంగా పెంచేసింది చిత్ర బృందం. ప్రమోషన్ కూడా నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో నిర్వహించాడు. ఒక్కో బెలూన్ దాదాపు 30 వేలు ఖర్చు చేసి ప్రధాన నగరాలలో ఎగురవేశారు. ఈ సినిమాకి బోనీకపూర్ సమర్పణ. మ్యూజిక్ సెన్షేషన్ థమన్ ఇచ్చిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వకీల్ సాబ్ సినిమాను మరో రేంజ్‌కి తీసుకువచ్చాయి. ఇవన్నీ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యే విధంగా తోడ్పడ్డాయి.

‘వకీల్ సాబ్’ దాదాపు ఏడాది ఆలస్యంగా విడుదలయింది. ఈ ఏడాది ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో ‘వకీల్ సాబ్’ వచ్చి సునామీని సృష్టించాడని చెప్పక తప్పదు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ థియేటర్స్ వద్ద జనాలు తండోపతండాలుగా వచ్చి చేరారు. కొన్నిచోట్ల చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి. అంటే ఎంతగా పవన్ సినిమా కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారో దీన్ని బట్టే అర్థమవుతొమది. ఇలాంటి వాతావరణం నెలకొంటుందని ఇండస్ట్రీ వర్గాలు కూడా ఊహించనిది. కానీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ‘వకీల్ సాబ్’పై పడటంతో రిలీజైన కొన్నిరోజులకే థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. అయితే విదేశాలతో పాటు మన దేశంలోనూ ‘వకీల్ సాబ్’ భారీ హిట్ కావడంతో ఆ తర్వాత అమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ చేయగా, అక్కడ కూడా ప్రేక్షకులు బాగా వీక్షించారు.

ఇదే క్రమంలో ఇటీవల బుల్లితెరపైకి ‘వకీల్ సాబ్’ ప్రసారం చేశారు. ‘వకీల్ సాబ్’ బుల్లితెరపై రాబోతుందనగానే అందరు మాట్లాడుకుంది ఏ రేంజ్ లో టీఆర్పీ రేటింగ్ నమోదవనుంది అనే. టీవీలో ప్రోమోలు ప్రసారమై బాగా హైప్ తీసుకు వచ్చాయి. కానీ సినిమా ప్రసారమయ్యక మాత్రం షాకింగ్‌గా టీఆర్పీ రేటింగ్ నమోదయింది. ‘వకీల్ సాబ్’ టాప్ ప్లేస్‌లో ఉంటాడనుకుంటే, అసలు టాప్ 10లో కూడా లేకపోవడం షాకింగ్ విషయం. కానీ ‘వకీల్ సాబ్’ నమోదు చేసిన 19.12 టీఆర్పీ రేటింగ్ చెప్పుకోదగినదే అంటున్నారు. అందుకు కారణం థియేటర్స్ రిలీజ్, ఆ తర్వాత అమెజాన్ లో స్ట్రీంగ్ కూడా అయింది. అయినప్పటికి స్మాల్ స్క్రీన్ మీద ‘వకీల్ సాబ్’కి ఈ రేంజ్‌లో టీఆర్పీ రేటింగ్ రావడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకుంటున్నారు.

అయితే ఇలా షాకింగ్ రేటింగ్ రావడానికి కారణం ఇందులో రిపీటయిన కొన్ని అంశాలు, ఇంకా ఉండాల్సిన ఓ కీలక అంశం అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇల్లు ఖాళీ చేసి వచ్చేటప్పుడు 15 నిముషాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. అక్కడ ఆయన లవ్ స్టోరీ గనక నడిపి ఉంటే బావుండేదని, ఇక రైతు సమస్యలు కాకుండా అమ్మాయిలకి సంబంధించిన అంశాలను చూపించి ఉంటే కిక్ ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహర్షి, ఖైదీ నంబర్ 150లో చూపించిన అంశాలనే వకీల్ సాబ్ లో రిపీట్ చేయడం కాస్త మైనస్ అనే మాట వినిపిస్తోది. ఏదేమైనా మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ సునుమాని సృష్టించాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

దోస పిండి నిల్వలో చిన్న తప్పు.. పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణం!

దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…

6 minutes ago

డయాబెటిక్ న్యూరోపతి పెరుగుతోంది.. కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకోండి!

మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…

14 minutes ago

నడుము నొప్పి బాధిస్తుందా? గంటల తరబడి కూర్చోవడం ప్రమాదం.. బ్యాక్ పెయిన్ తగ్గించే సింపుల్ టిప్స్!

నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…

3 hours ago

డెంగీ నుంచి రక్షణకు సింపుల్ టిప్స్.. ప్రతి ఇంటికి అవసరమైన అవగాహన!

నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…

4 hours ago

సాయికుమార్ తల్లి డైరీలో షాకింగ్ విషయం.. రాజశేఖర్ ఎమోషనల్..!

సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…

4 hours ago

వేసవిలో బెస్ట్ కూర ఇదే.. శరీరానికి చల్లదనం, రుచికి అదిరిపోయే టేస్ట్!

ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…

4 hours ago