బాలీవుడ్ బిగ్ బీ, మెగాస్టార్ గా ఎంతో పేరు సంపాదించుకున్న అమితాబచ్చన్ కుటుంబానికి ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఐశ్వర్య అభిషేక్ నటనను వారసత్వంగా పుచ్చుకొని తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే బిగ్ మీ మనవరాలు నవ్య నవేలి నంద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అమితాబచ్చన్ దంపతుల పెద్ద కుమార్తె శ్వేతా బచ్చన్ గారాలపట్టి నవ్య నవేలి. వృత్తిపరంగా శ్వేతా బచ్చన్ మోడల్ తన భర్త నిఖిల్ నంద ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. ఇక నవ్య చదువుపై శ్రద్ధ కనబరుస్తూ లండన్ లోని సేవినొక్స్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పొందారు. చూడటానికి ఎంతో అందం అభినయంతో ఉన్న నవ్యకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.
ఈమె అందం హీరోయిన్ కు ఏమాత్రం తగ్గదని చెప్పవచ్చు.సోషల్ మీడియా వేదికగా ఎంతో చురుకుగా ఉండే నవ్య తరచు తనకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే సదరు నెటిజన్లు ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని భావించినప్పటికీ తనకు సినిమాల్లో పెద్దగా ఆసక్తిలేదని తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన నవ్వకు సదరు నెటిజన్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఎంతో అందంగా ఉన్నారు కదా సినిమాలలోకి రావచ్చుగా అంటూ.. సదరు నెటిజన్ ప్రశ్నించడంతో అందుకు నవ్య తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే నవ్య మాట్లాడుతూ.. అందమైన స్త్రీలు వ్యాపార రంగంలో రాణిస్తారు అంటూ సదరు నెటిజన్ కు కౌంటర్ ఇచ్చింది.ఈ క్రమంలోనే తనకు నటనపై ఆసక్తి లేకపోవడంతో తన తండ్రి బాటలోనే వ్యాపార రంగంలో రాణించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…