కరోనా ప్రభావం వల్ల ప్రస్తుతం సినిమా రంగంలో ఓటీటీకి అధిక ప్రాధాన్యత దక్కుతుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే స్ట్రీమింగ్ సర్వీసుల్లో అభ్యంతరకర కంటెంట్ ఉంటే వాటిని కట్టడి చేయడంలో భాగంగా కేంద్రం కొరడా జులిపించడం మొదలైంది. ఈ క్రమంలోనే ఓటీటీ వేదికగా
నెట్‌ఫ్లిక్స్‌లో “ఘోస్ట్ స్టోరీస్” అనే షార్ట్ ఫిలిం ఏడాది క్రితం విడుదలైంది. ఈ క్రమంలోనే ఈ షార్ట్ ఫిలిం తీసినటువంటి నటుడు,బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ పై తొలి కేసును నమోదు చేశారు.
ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షార్ట్ ఫిలిం లో ఒక సీన్లో నటి శోభితా ధూళిపాళ పాత్రలో గర్భస్రావం అవుతుంది. ఈ క్రమంలోనే ఆమె మృతి చెందిన బిడ్డను చేతిలో పట్టుకొని కూర్చున్నటువంటి సీన్ పై కేసు నమోదు చేశారు. ఈ సీన్ ఆ కథకు అవసరం లేకున్నప్పటికీ మేకర్స్ ఆ సీన్ పెట్టడం వల్ల మహిళల మానసిక స్థితిపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతుందన్న ఉద్దేశంతో ఈ సీన్ పై ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే ఈనెల 27న ఈ సీన్ పై ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై కేస్ అవుతుందా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలలో భాగంగా సినిమా విడుదలైన 24 గంటలలోగా ఫిర్యాదు చేయాలని మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై అశ్లీలత, హింస, మనోభావాలు దెబ్బతీయడం, వ్యూయర్స్ మానసిక స్థితిపై ప్రభావం చూపే ఎలాంటి కంటెంట్ మీద అయిన అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. అభ్యంతరాలు వ్యక్తం అయితే సంబంధిత మేకర్స్ పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…