ప్రస్తుతం సినిమా రంగంలో పనిచేసే చాలామంది హీరోయిన్లు ఒకవైపు తమ నటనను కొనసాగిస్తూనే మరోవైపు పలు వ్యాపార రంగాలలోకి దిగి తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే సమంత, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లు సినిమాలలోను అటు వ్యాపారంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా ఈ బాటలో లేడీ సూపర్ స్టార్ నయనతార అడుగుపెట్టబోతోంది.
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార తాజాగా ఒక వ్యాపార రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ప్రియుడు విఘ్నేష్ తో కలిసి చెన్నైకు చెందిన ఛాయ్ వాలే అనే ఛాయ్ వ్యాపారం చేసే కంపెనీకి పెట్టుబడి పెట్టినట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమాల పరంగా మంచి స్థాయిలో ఉన్న నయన్ వ్యాపార రంగంలో ఎలాంటి వృద్ధిని సాధిస్తారో వేచి చూడాలి.
ఇక సినిమాల విషయానికొస్తే నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం నెట్రికన్. ఇందులో అంధురాలు పాత్రలో నయనతార సందడి చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తెలుగులో ఈ సినిమా మూడో కన్నుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ విధంగా నయనతార అంధురాలు పాత్రలో నటిస్తున్న టువంటి నెట్రికన్ సినిమాను విఘ్నేష్ శివన్ నిర్మిస్తుండగా
మిలింద్ రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా 13 న హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. కంటి చూపు కోల్పోయిన ఓ మహిళ వినికిడి శక్తి ఆధారంగా సీరియల్ కిల్లర్ ను ఎలా పట్టుకుంది అనే కథాంశంతో ద్వారా తెరకెక్కింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…