బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న దీపికా పదుకొనే ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో ఉందని చెప్పవచ్చు. కేవలం బాలీవుడ్లో మాత్రమే కాకుండా తమిళ, తెలుగు సినిమా అవకాశాలు దక్కించుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమా అవకాశాలు దక్కించుకుని బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, నాగ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అదేవిధంగా తమిళ్ తలైవా రజనీకాంత్ తో మరో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపించినప్పటికీ ఈ సినిమా గురించి ఎక్కడా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ బ్యూటీ షారుక్ ఖాన్ సరసన “పఠాన్”అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో దీపికా ఎంతో బిజీగా ఉన్నారు.
దీపిక ఇది వరకు ఏ సినిమాలో లేని విధంగా ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలలో నటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నా జీవితంలో ఇలాంటి భారీ యాక్షన్ సన్నివేశాలలో నటించడం ఇదే మొదటి సారి. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం తను ఎంతో కష్టపడుతున్నట్లు తెలిపారు. ఈ యాక్షన్ సన్నివేశాలలో నటించడం కోసం తనకొక ప్రత్యేక ట్రైనింగ్ అవసరం అయిందని, ప్రతిరోజు గంట పాటు ఈ ట్రైనింగ్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…