భాష రాదు.. భావం తెలీదు.. ఇతనెందుకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అన్నారు.. ఆయనే బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు..

సౌత్ సినిమా ఇండస్ట్రీలో గానీ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గానీ ఎప్పుడు కొందరు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తే కొందరు మాత్రం వాళ్ల మూలాలు ఎక్కడ వేళ్ళతో సహా పీకేస్తారో అనే అభద్రతా భావంతో కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయకుండా వీలైనంతవరకు తమకున్న పరపతి, పరిచయాలతో కొత్తవారిని రానివ్వకుండా చేసేవారు. ఇండస్ట్రీలో ఈ ధోరణి ఇప్పటికీ మారలేదంటే.. మారలేదనే చెప్పాలి. మనం మాత్రమే బావుండాలి.. పక్కన వాడు ఎదగకూడాదనే కుళ్ళు.. కుతంత్రాలతో వ్యసనంతో తొక్కాలని చూసేవాళ్ళు ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.

ఒక దశలో బాలీవుడ్ సంగీత దర్శకుడి విషయంలో ఇదే జరిగిందట. ఆయనే బప్పీలహరి. బొద్దుగా ఉన్నా ఉంగరాల జుట్టు, కళ్ళకి గాగూల్స్, మెడలో చైన్స్, బ్రాస్‌లెట్స్ వంటి ధరించి చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. అప్పటికీ ఇప్పటికీ ఆయనలో రాని మార్పు అంటే ఇది..ఆయన కంపోజ్ చేసే మ్యూజిక్. ఇండియన్ సింగర్ గా, కంపోజర్ గా యాక్టర్ గా రికార్డ్ ప్రొడ్యూసర్ గా దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యారు. ఆయన సంగీతం అందించిన సినిమాలన్ని మ్యూజికల్‌గా బ్లాక్ బస్టర్ అయ్యాయి. హీరోలు బప్పీలరి సాంగ్స్ అంటే ఊగిపోయేవారు. ఆయన మాంచి ఊపున్న సాంగ్స్ ఇచ్చారు.

అయితే బప్పీలరీ తెలుగులో సంగీతం అందించిన మొదటి సినిమా సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం. తెలుగులో సినిమాస్కోప్ లో పద్మాలయా సంస్థ మొదటి సారిగా నిర్మించిన సినిమా. అంతేకాదు తెలుగులో మొదటి 70 ఎం.ఎం.లో నిర్మించిన చిత్రం. ఇక్కడ మరో విశేషం కృష్ణ దర్శకునిగా ఈ చిత్రంతోనే పరిచయమయ్యారు. సింహాసనం చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా అందించడంతో పాటు ఎడిటింగ్ కూడా చూశారు.

ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా 1986లో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదటి సినిమాకి అద్భుతమైన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి కృష్ణ పంతానికి పోయి బప్పీ లహరిని తీసుకున్నారు. అప్పటికే బాలీవుడ్ ఆయన సంగీతం అందించిన సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే సింహాసనంకి సంగీత దర్శకుడిగా బప్పీ లహరిని తీసుకున్నందుకు కృష్ణని చాలామంది వారించారట. ఆయనకి తెలుగు భాష రాదు, ఇక్కడ కల్చర్ తెలీదు..పైగా డిస్కో సాంగ్స్ కంపోజ్ చేసే దర్శకుడు.. హిందీ వాడు. ఆయనకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగించడం ఏంటి మీరు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో రాంగ్ స్టెప్ వేస్తున్నారని చెప్పారట.

కానీ కృష్ణ వినిపించుకోలేదు. సింహాసనం సినిమాతో ఆయన చాలా ప్రయోగాలు చేశారు. మార్కెట్‌ని బడ్జెట్ కేటాయించారు. డైరెక్షన్ అందరూ వద్దని చెప్పినా ఆయనే దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్ ప్లే నిర్మాణం, ఫస్ట్ 70 ఎం.ఎం. సినిమా ఇలా చేసిన ప్రయోగాలలో సంగీత దర్శకుడిగా బప్పీలహరిని ఎన్నుకోవడం. అందరూ ఒక మాట మీద ఉంటే ఆయన మాత్రం తన పంథాలోనే కొనసాగారు. సింహాసనం ఆడియో సూపర్ హిట్. సినిమా రిలీజయ్యాక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని అందరూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ నటించిన స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్ , రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్, బిగ్ బాస్, బ్రహ్మ సినిమాలకి సూపర్ హిట్ ఆల్బంస్ ఇచ్చారు.