దానవీరశూరకర్ణ చిత్రంలో ఎన్టీఆర్ కంటే ఎక్కువ పాత్రలలో కనిపించిన ప్రముఖ నటుడు ఎవరో మీకు తెలుసా.?!

నందమూరి తారక రామారావు పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు. ఆయన అవలీలగా అలవోకగ, పౌరాణిక పాత్రలకు తగిన న్యాయం చేస్తారు. ఈ సినిమా మొదలు పెట్టే సమయానికి ఎన్టీ రామారావు తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని కథానాయకుడు. తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్ ఓ పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహించడం ఆరోజుల్లో పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. అలా 1977లో స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో దానవీరశూరకర్ణ చిత్రం విడుదల అయ్యింది. ఎన్టీ రామారావు, కొండవీటి వెంకటకవి కలిసి సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం దానవీరశూరకర్ణ చిత్రం.

ఎన్టీఆర్ నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలతో పాటు కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి మూడు పాత్రల్లో ఆయన నటించారనేకంటే జీవించాడని చెప్పవచ్చు. సభలో “ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి.. ఇది క్షాత్ర పరిక్షే కాని క్షత్రియ పరిక్ష కాదే.. కాదు, కాకూడదు” అనే సంభాషణను నేటికి ప్రేక్షకులు అనుసరించడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఎన్టీ.రామారావు కృషి, శ్రమ ఫలితంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ మహాభారతం లోని కొంత భాగాన్ని తీసుకుని ఒక పౌరాణిక చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. ఆ సినిమాకి సంభాషణల రచయితగా గుంటూరులోని ఓ సంస్కృత శకళాశాల ప్రిన్సిపాల్ అయినటువంటి కొండవీటి వెంకట కవిని తీసుకున్నారు.

అయితే ఈ కవికి ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. కానీ ఆయన రాసిన సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ధర్మరాజుగా ప్రభాకర్ రెడ్డి, అర్జునుడిగా హరికృష్ణ, భీముడిగా సత్యనారాయణ, అభిమన్యుడిగా బాలకృష్ణ.. ఇకపోతే ఈ చిత్రంలో మూడు పాత్రల్లో ఎన్.టి.రామారావు కనిపించగా.. ఇంద్రుడు, జరాసంధుడు, అతిరథుడు రెండు అతిధి పాత్రలతో మొత్తం.. ఐదు పాత్రల్లో చలపతిరావు ఈ సినిమాలో కనిపిస్తారు.

ఇంత భారీ చిత్రాన్ని కేవలం నలభై మూడు రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం జరిగింది. ఈ సినిమా నిడివి దాదాపు 4 గం.ల17 నిమిషాలు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఏదో ఒక పాత్రలో సుమారుగా నాలుగు గంటలపాటు కనిపిస్తారు.సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు అందించిన సంగీతం సినిమాకి ప్రాణం పోసిందని చెప్పవచ్చు.కొండవీటి వెంకటకవి,డాక్టర్ సి.నారాయణరెడ్డి,దాశరథి వంటి వారు ఈ సినిమాకి గీతాలను అందించారు. ఆ రోజుల్లో ఈ సినిమా ఘన విజయం సాధించింది.