సినిమాలలో హీరో హీరోయిన్లతో పాటు కమెడియన్స్ కి కూడా అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు కామెడీ ద్వారా కూడా ప్రజలను ఆకట్టుకున్నవి ఎన్నో ఉన్నాయి. అందుకే సినిమాలలో కమెడియన్స్ కదా అంటూ మనం వారిని ఏమాత్రం చులకన చేయకూడదు. ఎందుకంటే కమెడియన్స్ సంవత్సరం పొడవునా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గర అవుతూనే ఉంటారు. కానీ హీరో హీరోయిన్లు ఏడాదికి ఒక్క సినిమా తీసిన వారు సంపాదించిన దానికి రెట్టింపుగా వీరు కూడా సంపాదిస్తారని చెప్పవచ్చు.
ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ కమెడియన్స్ ఉన్నారు. అయితే ఈ స్టార్ కమెడియన్ ప్రతిరోజు షూటింగ్ లో పాల్గొంటే రోజుకు లక్షలలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మరి ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఏ కమెడియన్ రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనే విషయానికి వస్తే..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెన్నెలకిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఒక రోజు సెట్లోకి అడుగు పెడితే 2 నుంచి 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం రోజుకు 3 లక్షలు తీసుకోగా, అలీ 3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ రోజుకు 4 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.
కమెడియన్ సప్తగిరి కామెడీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈయన సినిమాలో ఉన్నారంటే ఆ సినిమా మొత్తం ఎంతో హాస్యాస్పద భరితంగా ఉంటుందని చెప్పవచ్చు.మరి ఒక రోజు సప్తగిరి సెట్ లో అడుగు పెడితే 2లక్షల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తారట. పోసాని 2.5 ఐదు లక్షలు తీసుకోగా, రాహుల్ రామకృష్ణ 2 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ రోజుకు 2 లక్షల పారితోషికం తీసుకోగా, కమెడియన్ ప్రియదర్శి రోజుకు 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇకపోతేకమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రతి రోజుకు 2 లక్షల వరకు చార్జి చేస్తుంటారని సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…