రచన నలభై సినిమాలకి పైగా ఒకే హీరోతో కలిసి నటించింది.. ఆయన ఎవరో తెలుసా..?

రచన బెనర్జీగా పాపులర్ అయిన హీరోయిన్ తెలుగులో రచనగా అందరీ సుపరిచితురాలు. ఆమె చూడటానికి అచ్చ తెలుగమ్మాయిలా ఉంటుందని మన టాలీవుడ్ అగ్ర దర్శకులు  ఇ.వి.వి.సత్యనారాయణ తెలుగు తెరకు పరిచయం చేశారు. రచనా బెనర్జీ బెంగాళీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి అక్కడ క్రేజీ హీరోయిన్‌గా పాపులర్ అయింది. రచన టాలీవుడ్‌కి రాక ముందు ఒరియా, బెంగాళీ భాషా సినిమాలలో నటించింది. ఆ భాషలలో సినిమాలు బాగా హిట్ అవుతుండటంతో దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ కంట్లో ఈమె పడింది.

ఆమె నటించిన సినిమాలు చూసిన ఇ.వి.వి.సత్యనారాయణ ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ‘నేను ప్రేమిస్తున్నాను’ అనే సినిమా ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమా మంచి హిట్ సాధించింది. జె.డి.చక్రవర్తి హీరోగా నటించిన ‘నేను ప్రేమిస్తున్నాను’ 1997లో విడుదలైంది. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. అటు ఒరియా, బెంగాళీ భాషా సినిమాలలో నటిస్తూనే తెలుగులో వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా చేసింది.

మొదటి సినిమా తర్వాత 1998 లో, ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలోనే కన్యాదానం అనే సినిమా చేసి భారీ హిట్ అందుకుంది. అంతేకాదు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారూ బాగున్నారా సినిమాలో నటించి వరుస హిట్స్ అందుకుంది. ఇదే ఏడాది జగపతి బాబు – ఇ.వి.వి.సత్యనారాయణ కాంబినేషన్‌లో వచ్చిన ‘మావిడాకులు’ సినిమాలో నటించింది. అంతేకాదు మంచు మోహన్ బాబు నటించిన రాయుడు సినిమాలో కూడా నటించి హిట్ అందుకుంది. చెప్పాలంటే రచన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సంవత్సరమే ఎక్కువ సినిమాలలో హీరోయిన్‌గా నటించి పాపులర్ అయింది.

ఇక ఎస్.వి.కృష్ణారెడ్డి స్వీయదర్శకత్వంలో నటించిన ‘అభిషేకం’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అదే సంవత్సరం ‘ఈశ్వర్ అల్లా’ అనే మరో సినిమా చేసింది. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న రచనకి శరత్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘సుల్తాన్’ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిది. అయిన ఈ సినిమా ప్రభావం రచనపై ఏమాత్రం పడలేదు. ఇక 2002లో వైవిఎస్ చౌదరీ దర్శకత్వంలో వచ్చిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమా తర్వాత టాలీవుడ్‌లో కనిపించలేదు.

అందుకు కారణం సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ బిజీగా మారడమే. ఇక్కడ సినిమాలు చేస్తున్న రచన ఒరియా, బెంగాళీ భాషలలో క్షణం తీరిక లేకుండా సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషలలో నటించిన రచన ఎక్కడ సినిమా చేసిన నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇ.వి.వి.సత్యనారాయణ హిందీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో తీసిన ‘సూర్యవంశ్’ సినిమాలో నటించి ఆకట్టుకుంది. అయితే ఈమె రచనా బెనర్జీ ఒరియాలో యాభైకి పైగా సినిమాలలో నటించింది. అందులో నలభైకి పైగా సిద్ధాంత్ మహాపాత్రతో కలిసి నటించిన సినిమాలుండటం విశేషం.

ఇలానే వీరు ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నారు. కానీ పెళ్ళైన కొన్నాళ్ళకే విడాకులు తీసుకున్నారు. అంతేకాదు అక్కడ అగ్ర కథానాయకుడిగా వెలుగుతున్న సిద్ధాంత్ మహాపాత్రతో కలిసి నటించలేక ఏకంగా ఒరియా ఇండస్ట్రీనే వదిలేసింది. ఆ తర్వాత 2005లో ప్రొబల్ ని రెండవ పెళ్ళి చేసుకుంది.

వీరికి ప్రొణీల్ అనే కొడుకు ఉన్నాడు. కాగా ఒరియా ఇండస్ట్రీ వదిలేసిన రచన బెంగాళీలో ప్రొసేన్‌జీత్ ఛటర్జీతో చాలా సినిమాలు చేసింది. వాటిలో దాదాపు అన్నీ సినిమాలు హిట్ సాధించాయి. అయితే ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్‌లో అవకాశాలు వస్తే నటించేందుకు సిద్దంగా ఉందట.