సినిమా ఇండస్ట్రీలో విలన్ చెప్పే డైలాగులకి కూడా చప్పట్లు కొడతరాని నిరూపించిన గొప్ప నటుడు నాగభూషణం

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం..ఇలా భాష ఏదైనా సినిమాలో హీరో చెప్పే డైలాగులకే థియేటర్స్ లో జనాలు చప్పట్లు కొడతారు. విజిల్స్ వేస్తారు. ఇక ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు, సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి సీనియర్ హీరోలు నటించిన సినిమాలకి అప్పట్లో జనాలు థియేటర్స్‌లో చప్పట్లు మాత్రమే కాదు ఏకంగా సీట్లు చింపేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. హీరో.. విలన్లను ఇరగ్గొడుతుంటే ప్రేక్షకుల్లో అదో కిక్కు.

కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ కాలం నాటి సీనియర్ నటులు నాగభూషణం చెప్పే డైలాగులకి ఆయన చూపించే విలనిజానికి ఎంత మంచి అభిమానులుండేవారో చెప్పడానికి లెక్కే లేదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలలో విలన్ పాత్రల్లో నటించి ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న నటులు నాగభూషణం. ఇప్పటి తరం నటీ నటులకి ఆయన ఓ రోల్ మోడల్. నెగిటివ్ రోల్స్ చేయాలనుకునే యువ నటులకి నాగభూషణం చేసిన విలన్ పాత్రలు మంచి రిఫరెన్స్.

నాగేశ్వర రావు లాంటి అగ్ర హీరోల మాదిరిగానే ఆయన కూడా ముందు స్టేజీ ఎక్కి, పలు నాటకాలు వేసి పేరు తెచ్చుకున్నారు. చిన్నతనం నుండి నాటక రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. మద్రాస్ నాటక రంగం ద్వారా నా భూషణంలోని అసలైన నటుడు బయటికి వచ్చారు. జి. వరలక్ష్మి, మిక్కిలినేని. ఆనాటికే ఎమ్మార్ రాధా, మనోహర్ వంటి వారు తమిళ నాటకాలను భారీ సెట్టింగులతో ప్రదర్శించి గొప్ప పేరు తెచ్చుకున్నారు. నాగభూషణం జీవితాన్ని మలుపు తిప్పింది ఇదే. ఆత్రేయ రాసిన భయం, కప్పలు వంటి నాటకాల్లో పాల్గొనేవారు. అలా నాగభూషణం-నటజీవితం ప్రారంభమయింది.

నాగభూషణం గురిచి ప్రత్యేకంగా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మాట్లాడుకునేది “రక్తకన్నీరు” నాటకం గురించి. ఎమ్మార్ రాధా, మనోహర్ ఆడిన రక్తకన్నీరు నాటకం ఆనాడు పెద్ద స్టేజ్ ప్లే సెన్సేషన్. దాన్ని తెలుగునాట చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచన నాగభూషణం జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్. దాదాపు 5వేలా 500ల ప్రదర్శనలు చేసింది రక్తకన్నీరు. చివరికి నాగభూషణం ఇంటి పేరుగా రక్తకన్నీరు మారిపోవడం గొప్ప విషయం. అలా నాగభూషణం ప్రతినాయక పాత్రకు కేరాఫ్ అడ్రెస్ గా మారారు.

అలా 1952లో వచ్చిన పల్లెటూరు సినిమా ద్వారా నాగభూషణం చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. ఏదీ నిజం అనే సినిమా ద్వారా హీరోగా కూడా నటించారు. కానీ ఆయన ఆ తర్వాత విలన్ పాత్రలకే మొగ్గు చూపారు. అంతేకాదు దర్శక, నిర్మాతలు, రచయితలు నాగభూషణం కోసం ప్రత్యేకంగా విలన్ పాత్రలు వాటిలో విచిత్రమైన డైలాగులు రాయించే వారు. ఇక ఆయన డైలాగ్ డెలివరీ, మ్యానరిజం ఓ ఐడెంటిటీగా మారింది. ఆయన సినిమాలో ఎదురుగా ఎంతటి స్టార్ హీరో ఉన్నా తను చెప్పే డైలాగులకి థియేటర్స్ చప్పట్లతో, విజిల్స్ తో మోత మోగొపోయేవి. ఆ కాలంలో ఇలాంటి నటుడు ఒక్క నాగభూషణం మాత్రమే.