Featured

మన్మథుడు సినిమా ఆ జర్మనీ మూవీ కాపీనా? వెలుగులోకి సంచలన నిజాలు !

2002 లో వచ్చిన నాగార్జున మూవీ మన్మథుడు గుర్తుంది కదా. ఆ సినిమా చూస్తే పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వాల్సిందే. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు.. నవ్వులే నవ్వులు. ఫుల్ టు కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన మన్మథుడు సినిమా అప్పట్లో సంచలనాలను సృష్టించింది. నాగార్జున, సొనాలీ బిందె జంటగా నటించిన ఈ సినిమా ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాకు కథను అందించింది త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా డైరెక్టర్ విజయ భాస్కర్.

అయితే.. ఈ సినిమా ఒక జర్మనీ మూవీ కాపీ అని తాజాగా ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 1998లో జర్మనీలో వచ్చిన ఫోర్ ఫర్ వెనిస్ అనే మూవీ స్టోరీని బేస్ చేసుకొని ఈ సినిమా కథను రాశారు.. అనేది ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న వార్త.

1998 అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఫోర్ ఫర్ వెనిస్ ప్రదర్శన

1998 లో హైదరాబాద్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా ఫోర్ ఫర్ వెనిస్(Four For Venice) ను ప్రదర్శించారు. ఆసమయంలో ఫారెన్ సినిమాలను చాలానే ప్రదర్శించారు. వందల సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా కథ ఏంటంటే.. ఒక మొగుడు(లాయర్) , పెళ్లాం.. ఇద్దరూ బిజీనే. మొగుడు పెళ్లాన్ని అస్సలు పట్టించుకోడు. వారానికి ఒకసారి మాత్రమే భార్యతో గడుపుతుంటాడు. దీంతో.. అతడి భార్య.. ఓ పెయింటర్ తో అఫైర్ పెట్టుకుంటుంది. ఆ పెయింటర్ భార్యతో ఈ లాయర్ కు గొడవ జరుగుతుంది. తన భార్య.. పెయింటర్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నదని తెలుసుకున్న లాయర్.. తనను మందలిస్తాడు. దీంతో పెయింటర్ తో కలిసి లాయర్ భార్య వెనిస్ కు పారిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న పెయింటర్ భార్య.. లాయర్ ను కిడ్నాప్ చేసి.. నీ భార్య.. నా భర్తను లేపుకుపోయింది.. పదా నా భర్తను వెతుకుదాం అని అతడిని వెంట పెట్టుకొని వెనిస్ వెళ్తుంది.

ఈ ప్రయాణంలో లాయర్ కు.. ఆమె మీద ప్రేమ కలుగుతుంది. అయితే.. లాయర్ కు నీళ్లంటే భయం. నీళ్లు ఉన్న వంతెన దాటాలన్నా భయం. కానీ.. చివరకు సినిమా క్లయిమాక్స్ లో షిప్ లో వెళ్తున్న తన దగ్గరికి వెళ్లడం కోసం నీళ్లలోకి దూకి తన దగ్గరికి చేరుకుంటాడు. చివరకు తన భార్యను వదిలేసి.. ఆ మహిళను పెళ్లి చేసుకుంటాడు.

మన్మథుడు సినిమాలో కూడా నాగార్జునకు నీళ్లంటే భయం

మన్మథుడు సినిమాలో కూడా నాగార్జునకు నీళ్లంటే భయం. పారిస్ వెళ్లినప్పుడు కూడా నీళ్లను చూసి భయపడతాడు. వంతెన దాటాలంటే భయపడతాడు. చివరకు క్లయిమాక్స్ లో హీరోయిన్ పెళ్లి అవుతుంటే.. షిప్ లో ఉంటే.. నీళ్లలో దూకి మరీ.. తన దగ్గరికి చేరుకొని తనను ప్రేమించే విషయం చెబుతాడు. అలా.. ఇద్దరూ ఒక్కటవుతారు. ఈ సినిమాలోని స్టోరీకి, ఫోర్ ఫర్ వెనిస్ సినిమాకు సంబంధం ఉంటుంది. అందుకే.. ఈ సినిమా ఇన్సిపిరేషన్ ఆ జర్మనీ మూవీ ఫోర్ ఫర్ వెనిస్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago