శ్రీదేవి ఓ అహంకారి.. తెరపై అన్యోన్యంగా నటించే వాళ్ళం.. కట్ చేస్తే ఎడమొఖం,పెడమొఖం. -జయప్రద

జయప్రద శ్రీదేవిలు హీరోయిన్ గా సినీరంగ ప్రవేశం ఇంచుమించుగా ఒకేసారి జరిగింది. రాజమండ్రిలో జన్మించిన జయప్రదకు చిన్న వయసులోనే సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి జయప్రదను చూసి సినిమాల్లో అవకాశం కల్పించారు. 1976 లో కె.బి.తిలక్ దర్శకత్వంలో వచ్చిన భూమికోసం చిత్రంతో జయప్రద తెలుగు తెరకు పరిచయమయ్యారు. అనతికాలంలోనే జయప్రద కళా దర్శకులతో నటించే అవకాశాన్ని పొందారు.

1976 కె.బాలచందర్ దర్శకత్వంలో అంతులేని కథ చిత్రం విడుదల అయ్యింది. ఈ చిత్రం జయప్రదకు పేరు తీసుకు రావడంతో పాటు సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత విశ్వనాధ్ దర్శకత్వంలో “సిరిసిరిమువ్వ” చిత్రం కూడా 1976 సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమా కూడా జయప్రద కు ఎంతో పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత అగ్రనటులు ఎన్టీరామారావు తో నటించే అవకాశం వచ్చింది. 1977లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “అడవిరాముడు” చిత్రంలో ఎన్టీఆర్ తో హీరోయిన్ గా జయప్రద నటించారు.ఊరికి మొనగాడు, ముందడుగు, స్వయంవరం, సంపూర్ణ రామాయణం, సాగర సంగమం లాంటి చిత్రాల్లో జయప్రద నటించారు.

తమిళనాడులో జన్మించిన శ్రీదేవి బాలనటిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. తెలుగులో 1975లో అనురాగాలు చిత్రంతో హీరోయిన్ గా రవికాంత్ సరసన నటించారు. ఆ తర్వాత బంగారక్క, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, కిరాయి కోటిగాడు, ప్రేమాభిషేకం శ్రీరంగనీతులు, మోసగాడు జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి చిత్రాల్లో శ్రీదేవి హీరోయిన్ గ నటించారు. అయితే జయప్రద, శ్రీదేవి కలిసి ముందడుగు, కృష్ణార్జునులు, దేవత లాంటి చిత్రాల్లో కలిసి నటించారు.

1982 సురేష్ ప్రొడక్షన్స్ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో దేవత సినిమా విడుదలయ్యింది. ఇందులో జయప్రద, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాల్లో చేస్తున్నంతసేపు జయప్రద, శ్రీదేవిలు చిరుబురులాడుకొనేవారు, అయితే జయప్రద శ్రీదేవి కలిసి నటించిన కొన్ని దృశ్యాలు.. అవి షూటింగ్ చేస్తున్న సమయంలో శ్రీదేవి జయప్రదలను కలిపి నటింపజేయడం దర్శకుడు కె.రాఘవేంద్రరావుకి కత్తి మీద సామయ్యేదని కె.రాఘవేంద్రరావు వివరించారు. లైట్స్, కెమెరా, యాక్షన్.. అనగానే ఇద్దరు కథలో లీనమై నటించేవారు. కట్, లైట్స్ ఆఫ్ అనగానే జయప్రద, శ్రీదేవిలు ఎవరి కుర్చీలోకి వారు వెళ్లి కూర్చునేవారు. విరామ సమయంలో అసలు మాట్లాడుకునేవారు కాదు. శ్రీదేవి అహంకారి అని.. షూటింగ్ లో ఎప్పుడు ఎడమొఖం, పెడమొఖం అన్నట్టుగా ఉండేవావారమని జయప్రద ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.