అఖిల్ అక్కినేని 3 సినిమాలు ఫ్లాపవడానికి కారణాలు ఇవేనా..?

అక్కినేని ఫ్యామిలీ హీరోలంటే అభిమానుల్లో మంచి అంచనాలుంటాయి. ఆ కాలంలో నాగేశ్వరరావు సినిమా వస్తుందంటే భారీ అంచనాలుండేవి. ఆయన కమర్షియల్ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలను చేశారు. అగ్ర హీరోగా ఒక వెలుగు వెలిగిన నాగేశ్వరరావు చివరిగా మనం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అక్కినేని ఫ్యామీలీ హీరోలు నటించడం ఓ గొప్ప అనుభూతి అయితే ఆ ఫ్యామిలీకి దర్శకుడు విక్రం కె కుమార్ గొప్ప బహుమతిగా ఇచ్చిన మరపురాని చిత్రం. మనం అక్కినేని ఫ్యామిలీఎంత ప్రత్యేకమో.. స్వయంగా పలు సందర్భాలలో నాగార్జునతో పాటు నాగ చైతన్య, అఖిల్, సమంత కూడా చెప్పారు.

ఈ సినిమాలో చిన్న రోల్ చేసిన అఖిల్ హీరోగా అఖిల్ చిత్రంతో పరిచయమైన విషయం తెలిసిందే. మనం క్లైమాక్స్ లో కనిపించిన అఖిల్ ఎంట్రీ హాలీవుడ్ సినిమా రేంజ్‌లో చూపించారు దర్శకుడు విక్రం కె కుమార్. ఆ బిల్డప్ షాట్స్, ఎలివేషన్స్ చూస్తే సినిమా మొత్తం కనిపించిన నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్యల కంటే బాగా ఎక్కువగా ఇచ్చారని చెప్పుకున్నారు. ఇది అందరికీ నచ్చింది కూడా. ఒకే ఒక్క సీన్ కాబట్టి బాగానే మానేజ్ చేశాడు అఖిల్. దాంతో అఖిల్ హీరో అయ్యే టైం వచ్చేసిందని అటు అభిమానులు ఇటు ఇండస్ట్రీ వర్గాలు నాగార్జునకి సలహాలిచ్చారు.

నాగార్జున కూడా అఖిల్ కి యూత్ లో బాగానే ఫాలోయింగ్ ఉందని హీరో చేయడానికి డిసైడయ్యాడు. అయితే నిర్మాణ బాధ్యత మాత్రం అఖిల్ కి అత్యంత సన్నిహితుడైన యూత్ స్టార్ నితిన్ తీసుకున్నాడు. భారీ బడ్జెట్‌తో స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా మొదటి సినిమా ‘అఖిల్’ వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఎంత భారీ డిజాస్టర్ అంటే దర్శకుడు వినాయక్ తీసుకున్న రెమ్యునరేషన్‌లో కొంత మొత్తం వెనక్కి తిరిగిచ్చేంత. సాంగ్స్, ఫైట్స్ వరకు ఓకే గానీ పర్ఫార్మెన్స్ పరంగా అఖిల్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాడని ఫైనల్ గా టాక్ వచ్చింది. అంతేకాదు అఖిల్ హీరో లాంచింగ్ కి ఇది సరైన కథ కాదని చెప్పుకున్నారు.

మొదటి సినిమా మరీ ఇంత డిజాస్టరా అని అక్కినేని ఫ్యామిలీ అవాక్కయింది. దాంతో ఎలాగైనా రెండవ సినిమాతో అఖిల్ కి హిట్ దక్కాలని నాగార్జున ఈసారి మనం దర్శకుడు విక్రం కె కుమార్ చేతిలో పెట్టాడు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అవగానే మళ్ళీ అంచనాలు పీక్స్ లో ఏర్పడ్డాయి. ఈ కథ కాస్త బెటర్. విక్రం కుమార్ మేకింగ్ కూడా చెప్పనక్కర్లేదు. కానీ రెండవ సినిమా ‘హలో’ కి కూడా అఖిల్ పర్ఫామెన్స్ పరంగా ఇంకా బాగా మెరుగవ్వాలి అని. ‘హలో’ మూవీ సాంగ్స్ చాలా బావుంటాయి. మ్యూజికల్ గా పెద్ద హిట్. కానీ సినిమా మాత్రం యావరేజ్ అని టాక్ వచ్చింది.

ఇక మూడవ సినిమా మిస్టర్ మజ్ఞు విషయానికొస్తే నాగేశ్వరావు, నాగార్జున నటించిన రొమాంటిక్ సినిమాల తరహాలో ట్రై చేశారు. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సాంగ్స్ హిట్. మేకింగ్ బావుంది. కానీ కథే పాత చింతకాయ పచ్చడిలా ఉందని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దానికి తోడూ ఈ సినిమా విషయంలోనూ అఖిల్ ఇంకా బెస్ట్ పర్ఫార్మర్ ఎప్పుడు అవుతాడు. నటన పరంగా అఖిల్ ఇంకా చాలా నేర్చుకోవాలి.. కొన్ని సీన్స్‌లో బాగా బిగిసుకుపోతున్నాడని చెప్పుకున్నారు. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా డల్‌గా కనిపించడం ఆడియన్స్‌కి నచ్చలేదు.

సినిమాలో చాలా వరకు ఆమె అలాగే కనిపిస్తుంది. దాంతో జనాలకి నీరసం వచ్చేస్తుంది. ఇప్పటికే ఈ తరహా కథలు బోలెడు వచ్చాయి కాబట్టి..చూసినోళ్ళకి అంతగా నచ్చలేదు. ఇలా మూడు సినిమాలు అఖిల్ పర్ఫార్మెన్స్ కి పెద్దగా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయాయి. దాంతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మీద దర్శక, నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వయంగా నాగార్జున సినిమా ఎడిటింగ్ సమయంలో దగ్గరున్నాడట. కొన్ని సీన్స్ రీ షూట్ కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి. మరి యాక్టింగ్ పరంగా తన నాలుగవ సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌’ తోనైన సక్సెస్ సాధించి మొదటి హిట్ అందుకుంటాడా లేదా చూడాలి. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే సినిమాలో కూడా అఖిల్ నటిసున్నాడు. ఈ సినిమా కోసం డిఫ్రెంట్ మేకోవర్ ట్రై చేస్తున్నాడు అఖిల్.