క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాల్సింది పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి ఘటనే ఒకటి తమిళనాడులోని విరుదునగర్‌లో చోటుచేసుకుంది. 30 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైంది.
భార్యభర్తల మధ్య విబేధాల కారణంగానే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మరణించిన కానిస్టేబుల్ భానుప్రియగా గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విరుదునగర్ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో భానుప్రియ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు ఐదు సంవత్సరాల క్రితం విష్నేష్ తో వివాహం జరిగింది. వీరిద్దరికి నాలుగేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడు ఉన్నారు.
ప్రస్తుతం వీరి కుటుంబం కులకరై ప్రాంతంలో నివసిస్తోంది. అయితే ఇటీవల దంపతుల మధ్య చిన్న సమస్యల కారణంగా గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విష్నేష్ తన నివాసాన్ని మధురైకి మార్చాలని అనుకున్నాడు. కానీ అతడి భార్య దానికి సిద్ధంగా లేదు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఇలా ఏదో ఒక సమస్య కారణంగా గొడవ పడుతూనే ఉన్నారు. ఓ రోజు తీవ్ర ఆవేదనకు గురైన విష్నేష్ ఆమె గొంతును బెల్ట్ తో బిగించి హత్య చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించి.. వివరాలను సేకరించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. భానుప్రియ మృతదేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వరకట్నం కోసం వేధించాడా.. అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…