రోజుకు రెండు సార్లు బ్రష్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

మనం రోజూ ఉదయం నిద్ర లేవగానే చేసే పని పళ్లు తోముకోవడం ద్వారా రోజంతా దంతాల్ని, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు పళ్లు తోముకోవడం‌ వల్ల మనకు సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని చెబుతున్నారు నిపుణులు.కొందరు పళ్లను చేపను రుద్దినట్లు రుద్దుతుంటారు.ఇలా అయితే దంతాలు తళతళా మెరుస్తాయనుకుంటారు. నిజానికి ఇలా రుద్దడం అస్సలు సరికాదంటున్నారు దంతవైద్య నిపుణులు.

దీనివల్ల పళ్లపై ఉండే ఎనామిల్‌ పొర తొలగిపోవడంతో పాటు ఇతర నోటి సమస్యలూ తప్పనని హెచ్చరిస్తున్నారు. అయితే రోజుకు ఎన్ని సార్లు బ్రష్ చేసుకోవాలి? ఏవిధంగా బ్రష్ చేసుకోవాలి? ఎంతసేపు చేసుకోవాలి అన్న అంశాల గురించి వివరాలు తెలుసుకుందాం.. దంతాలు శుభ్రంగా ఉండాలి అంటే రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే రోజుకు ఎన్నిసార్లు చేసామన్నది ముఖ్యం కాదు ఎంత సేపు చేసామన్నదే ముఖ్యం అని అంటున్నారు నిపుణులు.

కొందరు ఒక నిమిషం బ్రష్ చేస్తే సరిపోతుంది అంటే, మరికొందరు రెండు నిమిషాలు చేస్తే సరిపోతుందని అంటున్నారు. ఇక ఈ విషయంపై పరిశోధకులు తాజాగా ఓ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో వెల్లడైన పలు కీలక విషయాలు గురించి కూడా తెలిపారు. దంతాలపై ఉన్న గట్టి పొరను లేదా ధూళిని తొలగించడం కోసం కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాలపాటు బ్రష్ చేయాలని అధ్యయనంలో పరిశోధకులు తెలిపారు .

ఇక ఆ ప్రదేశాలు నాలుగు నిమిషాలు బ్రష్ చేయడం వల్ల దంతాలు తెల్లగా మారతాయి అనీ అధ్యయనంలో తేలింది. అయితే రోజుకు రెండు సార్లు కంటే బ్రష్ చేయడం, దంతాలపై ప్రెజర్ పెట్టడం వంటివి చేస్తే దంతాలు, శివుడు దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల బ్రష్ చేసేటప్పుడు దంతాలపై ఎక్కువగా ఒత్తిడి తీసుకు రాకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు రెండుసార్లు.. రెండు నిమిషాల పాటు బ్రష్ చేయాలని సలహాలను మనం అనుసరించవచ్చు, అలాగే బ్రష్ చేసేటప్పుడు పైన చెప్పిన సలహాలను పాటించడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.