గత ఇరవై రోజుల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసు గురించి హాట్ టాపిక్ గా మారింది. క్రూజర్ షిప్ రేవ్ పార్టీలో ఆర్యన్ డ్రగ్ వినియోగించారనే ఆరోపణల కారణంగా అతనిని అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి షారుక్ తన కొడుకును బయటకు తీసుకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతని తీవ్ర నిరాశే ఎదురవుతోంది.
గత ఇరవై రోజుల నుంచి ఆర్యన్ ఎన్సిబి అధికారులకు కస్టడీలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే షారుక్ తన కొడుకు బెయిల్ కోసం శతవిధాల ప్రయత్నాలు చేసిన అతనికి కోర్టులో చుక్కెదురైంది. ఇదిలా ఉండగా ఇక ఫలితం లేదని భావించిన షారుక్ ఖాన్ దేశంలోనే పేరు మోసిన అడ్వకేట్, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గిని రంగంలోకి దించారు.
ఈ క్రమంలోనే అడ్వకేట్ ముకుల్ రోహిత్గి తన వాదనతో ఎన్సీబీని కార్నర్ చేయగలిగారు. దీంతో ముంబై హైకోర్టు బెయిల్ ఇచ్చింది.ఈ క్రమంలోనే నేడు ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. ఇదిలా ఉండగా ఆర్యన్ ఖాన్ బెయిల్ విషయంపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ క్రమంలోనే ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ..ముకుల్ రోహిత్గికంటే ముందు వాదించిన లాయర్ లందరూ అసమర్థులు లేకపోతే తప్పు లేకున్నప్పటికీ ఆర్యన్ ఖాన్ ను ఇన్ని రోజులు జైలులో ఉంచారు అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు.
ఇదిలా ఉండగా దేశంలో అందరూ కూడా ఇలాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకోలేరు.డబ్బు లేనివారు జైలులోనే మగ్గిపోవాలా అలాంటి వారి పరిస్థితి ఏంటి అంటూ ఈ సందర్భంగా స్పందించారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…