సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలంటే ప్రేక్షకులకు ఒక అంచనా ఉంటుంది. అయితే రంగస్థలం సినిమాతో తనలో ఉన్నటువంటి మాస్ యాంగిల్ ని కూడా బయట పెట్టాడు దర్శకుడు సుకుమార్. ఈ క్రమంలోనే రంగస్థలం సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాలో అదే మాస్ యాంగిల్ లో పుష్ప సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ రష్మిక ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికీ పలు పోస్టర్లు పాటలు విడుదలయ్యాయి. తాజాగా ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్ సామి సామి అనే పాటను విడుదల చేయడంతో ఈ పాట కూడా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. మౌనిక యాదవ్ పాడిన ఈ పాటకు దేవి శ్రీ సంగీతం ఎంతో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.
ఇకపోతే ఇందులో సుకుమార్ హీరోయిన్ ను చూపించే విధానం అచ్చం రంగస్థలం సినిమాలోని రంగమ్మ మంగమ్మ అనే పాటలో సమంతను చూపించిన విధంగానే పుష్ప సినిమాలో సామి సామి అనే పాటలో శ్రీవల్లినీ చూపించినట్టు ఉందంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
అయితే ఈ పాటను విడుదల చేయగా అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. ఇకపోతే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ సినిమాను డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…