అమెరికాలో ఉన్నత విద్య చదువుతున్న వెంకటేష్ సడెన్ గా డి.రామానాయుడు పిలుపుమేరకు సినిమాల్లో నటించడానికి ఇండియా రావడం జరిగింది. ఆ క్రమంలో 1986 సురేష్ ప్రొడక్షన్స్ కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కలియుగ పాండవులు చిత్రం విడుదలయింది. ఈ చిత్రంలో వెంకటేష్, కుష్బూ హీరో, హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమా సూపర్ హిట్ అయినా కూడా వెంకటేష్ కు సినిమాల పై అంతగా ఆసక్తి ఉండేదికాదు. ఆ తర్వాత ఆయన మెల్లిగా సినిమాలపై అవగాహన, అభిమానం పెంచుకున్నారు.
ఆ క్రమంలో 1990 సురేష్ ప్రొడక్షన్స్, బి.గోపాల్ దర్శకత్వంలో బొబ్బిలిరాజా చిత్రం విడుదలైంది. అడవి నేపథ్యంలో పరుచూరిబ్రదర్స్ అందించిన పక్కా కమర్షియల్ కథా చిత్రం బొబ్బిలి రాజా అత్తగా వాణిశ్రీ నటన, దివ్యభారతి అందచందాలు ఇళయరాజా సంగీతం ఈ సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలిపింది.
1993, సౌదామిని క్రియేషన్స్, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో కొండపల్లిరాజా చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్ నగ్మా హీరో హీరోయిన్లుగా నటించారు. స్నేహానికి ఉన్న ప్రాధాన్యతను చెపుతూ వెంకటేష్ సుమన్ తమదైన పాత్రలో అద్భుతంగా నటించారు. అరుదైన ఈ కాంబినేషన్ ఉపయోగించుకొని రవిరాజా పినిశెట్టి సినిమాని విజయంవైపు నడిపించారు.
1995, ఎల్ వి ఎస్ ప్రొడక్షన్స్, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో పోకిరి రాజా చిత్రం విడుదల అయ్యింది ఈ సినిమాలో వెంకటేష్, రోజా, ప్రతిభాసిన్హ, శుభశ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఆంఖే అనే హిందీ చిత్రం ఆధారంగా పోకిరి రాజా సినిమా తీయడం జరిగింది. విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. పరుచూరి బ్రదర్స్ అందించిన డైలాగ్స్, రాజ్ కోటి స్వరపరచిన గీతాలు సినిమాని ఏమాత్రం బాక్సాఫీస్ వద్ద కొనసాగేలా చేయలేకపోయాయి.
1999,సూపర్ గుడ్ ఫిలింస్, ముప్పలనేనిశివ దర్శకత్వంలో రాజా చిత్రం విడుదలైంది. వెంకటేష్ సౌందర్య హీరోయిన్ లుగా నటించారు. ఓ తమిళ చిత్రానికి రీమేక్ గా రాజా చిత్రం రూపొందించబడింది. వెంకటేష్ సౌందర్య అద్భుత నటనతో సినిమాను విజయవంతం చేశారు. ఈ సినిమా మూడు సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ దక్కించుకుంది. ఎస్.ఎ రాజ్ కుమార్ స్వరపరచిన గీతాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ‘రాజా’ అనే టైటిల్ తో వచ్చిన నాలుగు సినిమాల్లో ఒక్క పోకిరి రాజా చిత్రం మాత్రమే వెంకటేష్ ను నిరాశ పరిచింది. మిగతా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయదుందుభి మోగించాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…