Pavitra: వాలెంటైన్స్ డే రోజే కాబోయే భర్తకు బ్రేకప్ చెప్పిన జబర్దస్త్ కమెడియన్?

Pavitra: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి వారిలో పవిత్ర ఒకరు. ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇదిలా ఉండగా గతంలో ఈమె తన ప్రియుడు సంతోష్ అనే మరో యూట్యూబర్ ను అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

వీళ్ళిద్దరూ మళ్లీ పెళ్లి అంటూ ఒక పెళ్లి వీడియోని చేసి అందరికీ షాక్ ఇచ్చారు అయితే ఇది ప్రాంక్ అని చెప్పారు. ఇక ఈ వీడియో చేసిన కొన్ని నెలలకే ఈమె సంతోష్ ను ప్రేమిస్తున్నానని తన ప్రేమ విషయాన్ని అందరికీ తెలియజేశారు. ఇక గత ఏడాది నవంబర్ నెలలో ఈమె తనతో నిశ్చితార్థం జరుపుకొని తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక వాలెంటెన్స్ డే రోజు ప్రతి ఒక్కరు కూడా తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండగా పవిత్ర మాత్రం అందరికీ షాక్ ఇచ్చారు. ఈమె తన ప్రియుడు సంతోష్ కు బ్రేకప్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పవిత్ర సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తామిద్దరం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఈ సమయంలో మాకు సపోర్ట్ చేయండి అంటూ ఈమె కోరారు.

నిజమేనా లేక ప్రాంక్ నా..

ఇలా తమ బ్రేకప్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడమే కాకుండా కామెంట్ బాక్స్ కూడా ఈమె క్లోజ్ చేశారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో సంతోష్ తో కలిసి దిగినటువంటి ఫోటోలు అన్నింటిని కూడా డిలీట్ చేశారు.దీనితో ఈ వార్తలు కాస్త వైరల్ కావడంతో నిజంగానే తనకు బ్రేకప్ చెప్పారా లేకపోతే ఇది కూడా ప్రాంకేనా అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/p/C3VK8e_pxEF/?utm_source=ig_embed&ig_rid=64f16ca7-e277-44b2-b3c1-389af841a6d0