Priyamani: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సీనియర్ నటి ప్రియమణి ఒకరు ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు పూర్తి అయ్యాయి. ఇలా హీరోయిన్గా ఫెయిడౌట్ అయినటువంటి ప్రియమణి ఇప్పటికీ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఈమె సీనియర్ హీరోలకు జోడిగా గృహిణి పాత్రలలో ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే ఈమె ఇటీవల నటించినటువంటి భామకలాపం 2 సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఆహాలో ప్రసారం కాబోతోంది. భామాకలాపం 2 సిరీస్లో ప్రియమణి గృహిణిగా హోమ్లీ రోల్ చేశారు. ఈ పాత్రలో ఓ పెద్ద గ్యాంగ్ ని అల్లాడించే వైలెంట్ షేడ్ కూడా ఉంది. నిజ జీవితంలో ప్రియమణి భర్తను భయపెడుతుందా? భయపడుతుందా? అనే ప్రశ్న ఈమెకు ఎదురయింది.
ఇలా తన వ్యక్తిగత విషయాల గురించి ఇలాంటి ప్రశ్నలు ఎదురైనటువంటి తరుణంలో ప్రియమణి మాట్లాడుతూ నేను నా భర్తకు భయపడతాను. అదేవిధంగా నా భర్తను భయపెడతాను కూడా అంటూ ఈమె సమాధానం చెప్పారు. భార్య భర్తల అన్న తర్వాత వారి మధ్య ఎన్నో రకాల గొడవలు ఉంటాయి. మా ఇద్దరి మధ్య కూడా గొడవలు చాలా జరిగాయని ఈమె తెలిపారు.
భార్యాభర్తల అన్నాక గొడవలు సహజం…
కొన్ని సందర్భాల్లో భర్త మన మాట వినాలి, మనం కొన్నిసార్లు వాళ్ళ మాట వినాలి. ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నమాట. అయినా భార్య భర్త అన్నాక గొడవలు సాధారణమేనని ఈమె తెలియజేశారు. ఇక ప్రియమణి ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఆయనకు ప్రియమణి రెండో భార్య ఇక ఈయన మాత్రం తన బిజినెస్ పనుల నిమిత్తం ఎక్కువగా అమెరికాలోనే ఉంటారు. కానీ ప్రియమణి మాత్రం సినిమాలలో నటిస్తూ ఇండియాలోనే ఉండడంతో వీరిద్దరు విడిపోయారని వార్తలు వచ్చాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…