Jabardasth: ఒక్కో ఎపిసోడ్ కోసం జబర్దస్త్ జడ్జిలకి మల్లెమాల ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారో తెలుసా?

Jabardasth: ఈటీవీలో మల్లెమాల వారు ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అయితే ఈ కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

జబర్దస్త్ కార్యక్రమానికి మొదట్లో రోజా, నాగబాబు జడ్జిలుగా వ్యవహరించేవారు.అయితే కొన్ని కారణాల వల్ల నాగబాబు తప్పుకోవడంతో ఆయన స్థానంలోకి సింగర్ మనో వచ్చారు.అదేవిధంగా రోజా గారికి మంత్రి పదవి రావడం చేత రోజా కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో రోజా స్థానంలోకి ఇంద్రజ వచ్చారు. ఇక మనో కూడా ఈ కార్యక్రమానికి స్థిరంగా లేకపోవడంతో ఆయన స్థానంలో ఎవరో ఒకరు వస్తున్నారు.

ఇకపోతే తాజాగా జబర్దస్త్ జడ్జ్ ల కోసం మల్లెమాలవారు ఒక్కో ఎపిసోడ్ కోసం ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తారనే విషయం గురించి చర్చనీయాంశంగా మారింది. రోజా ఎక్కువ ఎపిసోడ్ కోసం ఐదు లక్షల రెమ్యూనరేషన్ తీసుకునే వారట.ఇక ఈమె హీరోయిన్ కావడంతో ఈమెకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చారు ఇక ఈమెతో పాటు జడ్జిగా వ్యవహరించిన నాగబాబుకు మాత్రం ఒక్కో ఎపిసోడ్ కు మూడు లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చేవారు.

Jabardasth: ఒక్కో ఎపిసోడ్ కి లక్షల్లో రెమ్యూనరేషన్..

రోజా స్థానంలో కొనసాగుతున్న ఇంద్రజకు ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్ కు రెండున్నర లక్ష రెమ్యూనరేషన్ అందిస్తున్నారు. అదేవిధంగా నాగబాబు స్థానంలో కొనసాగుతున్న కమెడియన్ కృష్ణ భగవాన్ కు ఒక్కో ఎపిసోడ్ కి 2.50 లక్షల రెమ్యూనరేషన్ అందిస్తున్నారు. ప్రస్తుతం మల్లెమాలవారు జడ్జిలకు ఇస్తున్నటువంటి ఈ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.