Jabardasth: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న వారిలో ప్రవీణ్ ఒకరు. పటాస్ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో రాకింగ్ రాకేష్ టీమ్ లో సందడి చేస్తున్నారు.
ఇకపోతే ప్రతివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమం నుంచి ముందుగా ప్రోమో విడుదల చేస్తుంటారు ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా కంటెస్టెంట్లు ఎప్పటిలాగే పెర్ఫార్మెన్స్ చేసి అందరిని సందడి చేశారు. అయితే రాకింగ్ రాకేష్ స్కిట్ ద్వారా అందరిని సందడి చేసిన ప్రవీణ్ చివరిలో అందరిని ఏడిపించారు.
ఈ సందర్భంగా వేదికపై ప్రవీణ్ తన తల్లిదండ్రులను తలుచుకొని ఎంతో ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టుకున్నారు. దేవుడు మా అమ్మను తీసుకెళ్లాక నాకు నా తండ్రిని ఒక్కడినే ఇచ్చాడు.ఇక నాకు ఏ బాధ వచ్చిన నేను తన తండ్రితోనే చెప్పుకునే వాడిని ప్రతిరోజు సాయంత్రం ఏరా తిన్నావా? ఎలా ఉన్నావ్ అంటూ ప్రశ్నించేవారు. ఇలా నా యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత నాన్న పడుకునేవారు ఇప్పుడు నాన్నని కూడా దూరం చేసావంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.
ఈ విధంగా పటాస్ ప్రవీణ్ తన తల్లి తండ్రిని తలుచుకొని ఎమోషనల్ కాగా ఈయన బాధ విన్న ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే జడ్జ్ ఇంద్రజ తనని హక్కును చేర్చుకొని ఓదార్చే తనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…