విమానాశ్రయం మధ్యలో వ్యవసాయం చేస్తున్న రైతు.. ఎక్కడంటే?

సాధారణంగా చెరువుగట్టు దగ్గర లేదా కాలువల కింద.. బావుల కింద పంటలు పండించడం మనం చూస్తుంటాము. కానీ విమానాశ్రయం రన్ వే పక్కన వ్యవసాయం చేయడం విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న జపాన్ లో మాత్రం టకావో షిటో అనే వ్యక్తి రన్ వే పక్కన వ్యవసాయం చేస్తూ హాట్ టాపిక్ గా మారాడు.

జపాన్‌లోని అత్యంత రద్దీ అయిన విమానాశ్రయాల్లో న్యూ టోక్యో విమానాశ్రయం ఒకటి. 1960లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలని టోక్యో ప్రభుత్వం నిర్ణయించింది.అందుకుగాను ఆ చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్న భూములను రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసింది.కొందరి ఈ భూములు ప్రభుత్వానికి అమ్మి నగరానికి వెళ్లిపోగా మరి కొందరు ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయకూడదని పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగించారు.

ఈ ఉద్యమంలో ఎంతోమంది ప్రభుత్వానికి భూములు ఇవ్వగా టకావో షిటో తండ్రి మాత్రం తన భూమిని ఇవ్వకుండా అక్కడ వ్యవసాయం చేస్తున్నాడు.ఈ విషయంపై జపాన్ ప్రభుత్వం కోర్టుకు వెళ్లిన తీర్పు అతనికి అనుకూలంగా రావడంతో అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఈ తోటలోకి వెళ్లే మార్గాన్ని విమానాశ్రయ అధికారులు మూసివేయడంతో ఆ విషయంపై కోర్టుకెళ్లి దారిని ఏర్పరచుకున్నారు.

టకావో షిటో తండ్రిమరణం తర్వాత అతను ఇక్కడే కూరగాయలు, పండ్లను పండిస్తూ జపాన్ లోని ప్రముఖ రెస్టారెంట్లకు తరలిస్తున్నారు. నిత్యం ఎంతో శబ్దం చేసే ఈ రన్ వే పక్కన అతను వ్యవసాయం చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్నాడు. వారాంతపు రోజులలో
టకావో షిటో స్నేహితులు అక్కడికి చేరుకొని ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా గడుపుతుంటారు.ప్రభుత్వాన్ని ఎదిరించి తమ భూమిని కాపాడుకున్నారనే గౌరవం సంపాదించుకున్న టకావో షిటో కుటుంబం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.