Jayamalini : ఆ హీరో నన్ను చెడ్డది అన్నారు.. నా నడుముకు రెండు వైపులా చేయి వేసి ఏంటి నీది ఇంత పెద్దగా ఉందన్నారు : జయమాలిని

ఆ రోజుల్లో కుర్రాళ్ల మనసులో ఆమె ఒక కళల రాణి. దివినుండి భువికి దిగివచ్చిన అప్సరస,అతిలోక సుందరి.కుర్రాళ్ళ కాలేజీ పుస్తకాలు, పర్స్ లు తెరిచి చూస్తే ఆమె ముగ్ధ మనోహర రూపం దర్శనమిచ్చేది. నిద్రలో వచ్చే కళలు సైతం మరిపించి ఇది నిజమా అన్న భ్రమలోకి తీసుకెళ్ళిన అరుదైన సుందర రూపం ఆమె సొంతం.

దాదాపు ఆమె నటించి, నర్తించిన అనేక సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఓ సందర్భంలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు రానటువంటి జనం జయమాలిని షూటింగ్ చేస్తున్నప్పుడు తండోపతండాలుగా రావడం ఎన్టీ రామారావు గారిని ఆశ్చర్యానికి గురి చేసింది. తలుపులకు తాళం వేసి షూటింగ్ జరుగుతుంటే కుర్రకారు ఎగబడి చూసేవారు.

ఓ సుబ్బారావు..ఓ అప్పారావు.. నీ ఇల్లు బంగారం గాను.. గుడివాడ వెళ్లాను.. గుంటూరు వెళ్లాను.. సన్నజాజులోయ్.. లాంటి కైపెక్కించే వందలాది పాటలకు నర్తించి కుర్రకారు మతులు పోగొట్టి వారి గుండెల్లో జెండా పాతిన ఆనాటి క్లబ్ డాన్సర్ జయమాలిని. అయితే ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయమాలిని మాట్లాడుతూ.. అలనాటి స్టార్ హీరో అయినా అక్కినేని నాగేశ్వరావుతో ఆలుమగలు, రాముడు కాదు కృష్ణుడు, బహుదూరపు బాటసారి, సంగీత సామ్రాట్ వంటి చిత్రాలలో ఆయన సరసన నర్తించడం జరిగిందని ఆమె చెప్పారు. అలా ఒక రోజు షూటింగ్ చేస్తున్న క్రమంలో అక్కినేని తన భార్యతో షూటింగ్ కి హాజరయ్యారు…ఆయనను చూడగానే నమస్కారం పెట్టాను.. అటు వెళ్తున్న నన్ను చూసి జయమాలిని ఆగు అని పిలిచారు. మా ఆవిడ నిన్ను చెడ్డ అమ్మాయి అని అంటుందన్నారు.

నేను కాదు ఆవిడ అలా అంటున్నారన్నారు. అప్పుడు నేను చిన్నగా చిరునవ్వు నవ్వాను. ఆయన ఎప్పుడూ లొకేషన్లో అల్లరి చేస్తుండేవారని అలాగే అక్కినేని, నేను ఓ పాటలో డాన్స్ చేస్తున్నప్పుడు ఆయన నా నడుమును రెండు చేతులతో పట్టుకున్నారు. ఏమిటి మీ నడుము ఇంత పెద్దగా ఉంది, నా రెండు చేతులకు కూడా అందడం లేదన్నారు. అక్కడే ఉన్న మరో నటుడు గిరిబాబు కలిపించుకొని జయమాలిని అలా అడుగుతారేంటి ఆ విషయం వాళ్ళ అమ్మానాన్నని అడగాలన్నారు. అలా అనేసరికి నేను అవాక్కయ్యాను. అప్పుడు షూటింగ్స్ అన్నీ కూడా సరదాగా సాగిపోయేవన్నారు. అక్కినేని మంచి డాన్సర్ అని “ఆలుమగలు” చిత్రంలో “రా రా రంకె వేసిందమ్మో రంగ అయినా పోట్ల గిత్త “… అనే పాటలో ఆయన అద్భుతంగా డాన్స్ చేశారని. అప్పుడున్న నటుల్లో అక్కినేని, ఆ తర్వాత జనరేషన్ లో వచ్చిన చిరంజీవి మంచి డాన్సర్స్ అని ఆ ఇంటర్వ్యూలో ఆనాటి జ్ఞాపకాలను జయమాలిని గుర్తు చేసుకున్నారు.