Puri Jagannath : లైగర్ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల అయి మ్యాజిక్ చేస్తుందనుకుంటే సినిమా నిరాశ పరిచింది. అటు విజయ్ దేవరకొండ కెరీర్ కి ఇటు పూరి కెరీర్ కి బ్రేక్ పడేలా చేసింది. ఈ సినిమా నష్టాలను మిగల్చడంతో ప్రొడ్యూసర్లైనా పూరి జగన్నాథ్,ఛార్మి ఇద్దరు వారి ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి పూరి జగన్నాథ్ మీద చాలా మందికి అభిమానం. అందుకే ఆయన సినిమాలను ప్లాపులు వరుసగా వస్తున్న చూస్తున్నారు. కానీ ముందులా మాత్రం సినిమాలను పూరి ప్లాన్ చేసుకోవడం లేదు. ఇక కథను పక్కనబెట్టి సినిమా తీస్తే ఇలానే ఉంటుంది అన్నటు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది హీరోలు పూరి తో సినిమాలు చేయడానికి ఓకే కానీ ఛార్మి మాత్రం ఆ సినిమా విషయంలో వేలు పెట్టకూడదు అని అనుకుంటున్నారట. అయితే ఇందులో ఎంత నిజముందో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ విశ్లేషించారు.
పూరి సినిమా బాగా తీయకపోతే ఛార్మికి సంబంధం ఏంటి….
ఇస్మార్ట్ శంకర్ సినిమా సమయంలో ఛార్మి రావడం వల్ల పూరి హిట్ కొట్టాడు అన్నారు. ఇప్పుడు ఛార్మి ఉంటే పూరి సినిమా ప్లాప్స్ అవుతాయి అంటున్నారు. నిజానికి రెండు వాస్తవం కాదు. సినిమా కథ సరిగా ఎంపిక చేసుకుని సినిమా చేస్తే ఏ సినిమా అయిన హిట్ అవుతుంది. పూరి మొదటి నుండి సినిమా తీయడానికి కథ అవసరం లేదు అన్న భావనలో ఉన్నాడు. ఇపుడు కూడా లైగర్ సినిమా విషయంలో పూరి కొంచెం శ్రద్ధ పెట్టి కథను చక్కగా ఎంపిక చేసుకుని స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే సినిమా హిట్ అయ్యుండేది. ఛార్మి సినిమా నిర్మాణ బాధ్యతల వరకే అంతేకాని సినిమాలో వేలు పెట్టలేదు కదా మరీ ఆ విమర్శలు తప్పు అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.
పూరి మంచి కథ రెడీ చేసుకుంటే మళ్ళీ పుట్టి తో సినిమా చేయడానికి హీరోలు సిద్ధమే. అందున ప్లాపులతో ఉన్న సమయంలో బాలకృష్ణ వంటి మాస్ హీరోతో ఒక కమ్ బ్యాక్ ఇస్తే బాగుంటుంది. బాలకృష్ణ డైరెక్టర్ సినిమాల హిట్ ప్లాప్ ను పట్టించుకోడు కథ నచ్చేలా చెబుతే చాలు పెద్దగా ఇంకేం మాట్లాడకుండా సినిమ ఓకే చేస్తాడు. పూరికి ఇప్పుడు బాలయ్య మంచి ఆప్షన్ అంటూ కామెంట్స్ చేసారు. ఒకవేళ నిర్మాణ బాధ్యతలు వేరేవాళ్లు తీసుకుంటే ఛార్మి ఇక సినిమా విషయంలో జోక్యం చేసుకోదు అలాగే పూరికి సినిమా విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి అంటూ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…